బుట్టబొమ్మ టీజర్.. ఇంట్రెస్టింగ్ గా ఉందే

0

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్- త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘అల వైకుంఠపురములో’. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు ప్రమోషన్స్ జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా పాటలు యూట్యూబ్ లో రికార్డుల దుమ్ము దులుపుతున్నాయి. తాజాగా ఈ సినిమానుండి బుట్టబొమ్మ అంటూ సాగే పాట టీజర్ ను రిలీజ్ చేశారు.

ఈ సినిమాకు థమన్ సంగీత దర్శకుడు. బుట్టబొమ్మ పాటకు సాహిత్యం అందించినవారు రామజోగయ్య శాస్త్రి. పాడిన వారు అర్మాన్ మాలిక్. “బుట్టబొమ్మా బుట్టబొమ్మా నన్ను సుట్టుకొంటివే జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకొంటివే” అంటూ ప్రేక్షకులను ఆకట్టుకునేలా సాగింది సాహిత్యం. టీజర్ లో అర్మాన్ మాలిక్ ఈ పాటను పాడే వీడియో చూపించారు. టీజర్ ను చూస్తుంటే పాట ఇంట్రెస్టింగ్ గా ఉన్నట్టే అనిపిస్తోంది. స్టైలిష్ బన్నీ బ్యూటిఫుల్ పూజ వెనక పడుతూ ఈ పాట పాడడం.. ఓ రొమాంటిక్ సందర్భమే కదా. ఈ టీజర్ లోనే బుట్టబొమ్మ ఫుల్ సాంగ్ డిసెంబర్ 24 వ తేదీన రిలీజ్ అవుతుందని వెల్లడించారు.

ఈ సినిమాలో జయరామ్.. టబు.. నివేద పేతురాజ్.. సుశాంత్.. నవదీప్.. సునీల్.. రాజేంద్ర ప్రసాద్.. సముద్రకని ఇతర కీలక పాత్రల్లో నటించారు. గీతా ఆర్ట్స్.. హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ‘జులాయి’.. ‘S/o సత్యమూర్తి’ లాంటి హిట్స్ తర్వాత అల్లు అర్జున్- త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
Please Read Disclaimer