బాలీవుడ్ లో పెరిగిపోతున్న బై సెక్సువల్స్??

0

బాలీవుడ్ మొదటి నుంచి ఫాస్టే. సౌత్ సినిమా ఇండస్ట్రీలవారు తమ సత్తా చాటవచ్చు.. ప్యాన్ ఇండియా సినిమాలు చేయవచ్చు కానీ అన్నీ విషయాల్లో బాలీవుడ్ ను అందుకోవడం మాత్రం దాదాపు అసాధ్యం. లవ్ ఎఫైర్లు.. పెళ్ళిళ్ళు.. విడాకులు బాలీవుడ్లో చాలా కామన్. ముకేష్ యాడ్.. రాహుల్ ద్రావిడ్ యాడ్లు అసలు బాలీవుడ్ రేంజ్ కు సరిపోవు. ఎందుకంటే అక్కడ ఉండే సెలబ్రిటీలలో లిక్కర్ తో సరిపెట్టుకునే రకాలు కాదు. డ్రగ్స్ ఉపయోగం సాధారణమైన విషయం. స్మోకింగ్ కు.. డ్రింకింగ్ అయితే ముకేష్ యాడ్లు సరిపోతాయి కానీ ఇంకా డ్రగ్స్ తీసుకోవడం చట్టరిత్యా నేరం అనే యాడ్లు ఇంకా సినిమాల్లో రాలేదు కదా.

ఇక కేసులు.. మాఫియాతో లింకుల విషయంలో కూడా బాలీవుడ్ ఎప్పుడూ ముందువరసలోనే ఉంటుంది. ఇవన్నీ చాలవన్నట్టు సెక్సువల్ ఓరియెంటేషన్ విషయంలో కూడా బాలీవుడ్ ఎప్పుడూ హాలీవుడ్ ను అందుకునేందుకు ట్రై చేస్తూ ఉంటుంది. గేలు.. లేస్బియన్ల సంఖ్య బాలీవుడ్ లో ఎక్కువేనని ఇప్పటికే పలుమార్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి. రీసెంట్ గా ఒక బాలీవుడ్ వెబ్ సైట్ అయితే మరో సంచలన విషయం వెల్లడించింది. బాలీవుడ్లో బై సెక్సువల్స్ సంఖ్య విపరీతంగా పెరుగుతోందట.

ఇంతకీ బై సెక్సువల్ అంటే ఏంటో తెలుసా? చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియనివారి కోసం చెప్పుకోవాలిగా.. సాధారణ జనాల అభిప్రాయం ప్రకారం సెక్స్ అనేది మగ ఆడ మధ్య జరుగుతుంది. హోమో సెక్సువల్స్ అంటే మగ – మగ. లెస్బియన్స్ అంటే ఆడ -ఆడ. ఈ బై సెక్సువల్ అంటే ఆపోజిట్ సెక్స్ వ్యక్తితో పాటుగా సేమ్ సెక్స్ ఉండేవారితో కూడా లైంగిక సంబంధాలు పెట్టుకోవడం. అంటే ఒక హీరో ఉన్నాడనుకోండి.. హీరోయిన్లతోనే కాకుండా హీరోలతో కూడా ఉమ్మ ఉమ్మ అంటూ లిప్పు లాకులు లాగిస్తూ బెడ్ పై వీలైనంత దూరం పోవడం. అదే హీరోయిన్ అనుకోండి.. హీరోలతో ఎఫైర్లు సాగిస్తూ రచ్చగా సెక్స్ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే తోటి హీరోయిన్లతో కూడా లైంగిక సంబంధాలు కొనసాగించడం.

ఈ రచ్చరంబోలా చాలా దూరం వెళ్ళింది కాబట్టే బాలీవుడ్ ప్రముఖులు నిర్వహించే చాట్ షోలలో సెక్సువల్ ఓరియెంటేషన్ పై ప్రశ్నలు చాలా కామన్ అయ్యాయి. సెక్సువల్ ఓరియెంటేషన్ అంటే స్ట్రెయిట్.. గే.. లెస్బియన్… లేదా బైసెక్సువలా అని అడగడం. దీనికి చాలామంది సెలబ్రిటీలు డైరెక్ట్ గానో ఇన్ డైరెక్ట్ గానో జవాబులు ఇవ్వడం మరింత కామన్ అంశం. టాలీవుడ్ లో కూడా ఎన్నో షోలు ఉన్నాయి. కానీ ఒక్క షోలో కూడా “మీ సెక్సువల్ ఓరియంటేషన్ ఏంటి?” అనే ప్రశ్న ఇంతవరకూ మీరు చూసి ఉండరు. అంటే ఇక్కడ టాలీవుడ్ లో అలాంటి జనాలు లేరని కాదు కానీ ఆ ప్రశ్నను అతిథులు అఫెన్సివ్ గా తీసుకుంటారేమోనని ప్రశ్నలు అడిగేవారికి భయం.. మన సొసైటీ కండిషనింగ్ ను పక్కన పెట్టి ఒకవేళ అతిథులు జవాబిస్తే..ఆ జవాబును ఓపెన్ మైండ్ తో స్వీకరించేంత పెద్ద మనసున్న ఆడియన్స్ లేకపోవడం మరో కారణం కావచ్చు.

ఏదేమైనా ఈ చర్చలన్నీ సంప్రదాయవాదులకు షాక్ ఇచ్చి షేక్ కు గురి చేసేవే. “అక్కడెక్కడో అమెరికాలో భారతీయ మగ జంట పెళ్ళి చేసుకున్నారు” అదేదో ఎక్కడో జరిగిందని న్యూస్ చదువుతాం. కానీ మన ఇంట్లో.. పక్కింట్లో.. వెనకింట్లో ఉండేవారి సన్నిహిత బంధువులు ఎవరో ఒకరు అమెరికాలో ఉన్నారు. అలాంటివారిలో ఒక జంటే ఆ జంట అనే నిజాన్ని అంగీకరించము. అందుకే ప్రపంచంలో ఏం జరుగుతోంది.. బాలీవుడ్ లో ఏం జరుగుతోంది తెలుసుకుంటూ ఉండాలబ్బా!
Please Read Disclaimer