బాలయ్యతో లొల్లేం లేదన్న నిర్మాత

0

నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా కె.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో సి. కల్యాణ్ నిర్మాతగా రూలర్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. జై సింహా తో బ్లాక్ బస్టర్ కొట్టిన కాంబో కావడంతో తాజా సినిమాపై భారీ అంచనాలేర్పడ్డాయి. ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. బాలయ్య పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ సినిమాకు బాలయ్య భారీగా పారితోషికం డిమాండ్ చేసినట్లు కథనాలొస్తున్నాయి. మునుపటి పారితోషికం కన్నా రెట్టింపు తీసుకుంటున్నారని వారం రోజులుగా సోషల్ మీడియాలో ఒకటే చర్చ.

జై సింహతో నిర్మాతకు భారీగా లాభాలు వచ్చిన నేపథ్యంలో బాలయ్య ఈ సినిమాకు భారీగానే డిమాండ్ చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో బాలయ్య- నిర్మాత మధ్య వివాదం తలెత్తినట్లు కథనాలొస్తున్నాయి. తాజాగా వాటన్నింటికి చిత్రనిర్మాత సి. కళ్యాణ్ ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసారు. హీరోతో ఎలాంటి విబేధాలు తలెత్తలేదని.. బాలయ్య బాబు పారితోషికం డిమాండ్ చేయలేదని కళ్యాణ్ ఖండించారు. ఆన్ సెట్స్ లో హెల్దీ వాతావరణంలో షూటింగ్ జరగుతుందోని…ఇలాంటి కట్టు కథనాలు కట్టిపెట్టాలని సోషల్ మీడియాపై అసంతృప్తిని వ్యక్తం చేసారు.

జై సింహ షూటింగ్ ఎంత హ్యాపీగా జరిగిందో…రూలర్ షూటింగ్ అంతకు మించి సంతోషంగా జరగుగుతోందని.. తన గురించి బాలయ్యకు- ఆయన గురించి తనకు బాగా తెలుసునని వివరణ ఇచ్చారు. ఇందులో బాలయ్య పోలీస్ అధికారిగా.. డాన్ పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన బాలయ్య న్యూలుక్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని పనులు పూర్తిచేసి డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురవడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Please Read Disclaimer