భార్యను టీజ్ చేస్తే వెంటపడి తన్నాడట!

0

సినిమాల్లో హీరోయిన్లను పోకిరీలు టీజ్ చేస్తే హీరో ఒక్కడే వెంటపడి కొట్టడం చూస్తుంటాం. అది సినిమా కాబట్టి వేధించిన వాళ్లు దిబ్బలు తినాలి. హీరోలు వెంటపడి తన్నాలి. మరి రియల్ లైఫ్ లో అలా జరుగుతుందా? అంటే అది ఎక్కడో అరుదుగానే జరుగుతుంది. తేడా కొడితే తిరిగి బోయ్ ప్రెండ్ నే తన్నులు తినాల్సి ఉంటుంది. కానీ ఓ రీల్ డైరెక్టర్ రియల్ గానే తన ప్రేమసిని వేధిస్తే వెంటపడి పరుగులు పెట్టించి మరీ తన్నాడుట. దొరికిన వాళ్లను దొరికట్లు ఉతికారాసేడట. ఇంతకీ ఈ ప్రేమ కహాని ఎవరిది? అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.

అలనాటి అందాల హీరోయిన్ ఖుష్బూ-డైరెక్టర్ సుందర్ సి. ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వాళ్లిద్దరి దాంపత్య జీవితం సంతోషంగా సాగుతోంది. ఒక సినిమా షూటింగ్ కోసం ఖుష్బు-సుందర్ పొల్లాచీ వెళ్లారట. అప్పుడు ఖుష్బూ ఏనుగుపై కూర్చొన్న సన్నివేశంలో నటిస్తుందిట. దూరంగా సుందర్ ఉన్నాడుట. కెమెరా వెనుక ఉన్న ఓ వ్యక్తి ఖుష్బూ అందాన్ని..శరీరాన్ని ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడుట. దీంతో సుందర్ ముందుగా ఆ వ్యక్తికి మహిళల గురించి అలా మాట్లాడవద్దని హెచ్చరించాడుట.

అయినా సుందర్ మాటలని పెడ చెవిన పెట్టి అదే పనిగా ఖుష్బూ గురించి చెత్తగా మాట్లాడుట. దీంతో తప్ప తాగి అలా మాట్లాడుతావా? అంటూ సహనం కోల్పోయిన సుందర్ ఆ వ్యక్తిని కొట్టాడుట. అక్కడితే ఆగకుండా ఆ వ్యక్తి పారిపోతుంటే సుందర్ వెనుక లగెత్తి మరీ దొర్లించి కొట్టాడుట. మరి ఆ దెబ్బలు తిన్నదేవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. వాళ్లు మప్టీలో ఉన్న పోలీసు అట. ఈ విషయం సుందర్ కి తెలిసిన తర్వాత షాక్ అయ్యాడుట.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-