కియరా.. ఆప్టే అంత బోల్డ్ గా చేస్తుందా?

0

తెలుగమ్మాయి ఇషా రెబ్బా డ్యాషింగ్ యాటిట్యూడ్ గురించి తెలిసిందే. ఈ అమ్మడిలో మల్లూ భామలు.. ముంబై బ్యూటీస్ తో పోటీపడేంతటి అందం ప్రతిభ ఉన్నా.. ఎందుకనో ఆశించినంతగా కెరీర్ ని మలుచుకోలేక చతికిలబడుతోంది. తెలుగమ్మాయిలు అంటే మన దర్శకనిర్మాతల ఆలోచన ఎలా ఉంటుందో ఇంతకుముందు కాస్తంత ఘాటుగానే స్పందించింది. అయితే ఇప్పుడు తనలోనూ కాస్తంత రియలైజేషన్ కనిపిస్తోంది. పట్టు విడుపు అన్న భావనపై సీరియస్ గానే ఆలోచిస్తోందట.

`రాగల 24 గంటల్లో` అంటూ వేడెక్కించే హారర్ చిత్రంతో ప్రేక్షకాభిమానుల ముందుకు వస్తున్న ఇషా రెబ్బా తదుపరి ఓ వెబ్ సిరీస్ లో నటించేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో తెరకెక్కి బ్లాక్ బస్టర్ అయిన బోల్డ్ వెబ్ సిరీస్ `లస్ట్ స్టోరీస్` తెలుగు రీమేక్ లో ఇషా రెబ్బా ఓ స్టోరీని ప్లే చేయబోతోందిట. తన లుక్ చాలా బోల్డ్ గా ఉంటుందని తెలుస్తోంది. తెలుగు `లస్ట్ స్టోరీస్` లో అమలా పాల్ ఓ స్టోరీని ప్లే చేసేందుకు ఎంపికైన సంగతి తెలిసిందే. మరి ఇషా ఎలాంటి రోల్ ప్లే చేయబోతోంది? అన్నది నేరుగా నెట్ ఫ్లిక్స్ లో చూసి తెలుసుకోవాల్సిందేనేమో?

ఓ క్లోజ్ సోర్స్ ప్రకారం.. ఇషా కొన్ని హాట్ సీన్స్ లో నటించబోతోందట. ఒకవేళ ఇదే నిజమైతే తన మైండ్ సెట్ ఇంకాస్త ఓపెన్ అయినట్టే. అవసరం మేర గ్లామర్ ఎలివేషన్ లేకపోతే స్టార్ డమ్ అన్నది దరి చేరదు. మరి ఈ విషయంలో పట్టు విడుపు చూపిస్తోందేమో! ముంబై బ్యూటీ కియరా అద్వానీ.. రాధిక ఆప్టే తరహాలో కాస్తంత బోల్డ్ యాటిట్యూడ్ ని అలవాటు చేసుకుంటుందనే అభిమానులు భావిస్తున్నారు.

Comments are closed.