హాట్ బ్యూటీకి ఈసారైనా హిట్ దక్కేనా..?

0

‘Rx 100’ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన పాయల్ రాజ్ పుత్.. ఫస్ట్ సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకుంది. అయితే ఆ తర్వాత పెద్దగా హిట్లు లేకపోయినా తన హాట్ హాట్ అందాలు కురిపించడంలో వెనకడుగు వేయకపోవడంతో సినిమాల్లో అవకాశాలు.. అలానే రెమ్యూనరేషన్ బాగానే వస్తున్నాయి. ఈ క్రమంలో పాయల్ రాజ్ పుత్ నటించిన లేటెస్ట్ మూవీ ‘అనగనగా ఓ అతిథి’. ఈ చిత్రానికి పాయల్ సుమారు70 లక్షలు పారితోషికం తీసుకున్నట్లు టాక్. చైతన్య కృష్ణ కీలక పాత్రలో నటిస్తున్న పీరియాడిక్ల్ థ్రిల్లర్ తెలుగు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ ‘ఆహా’ లో నవంబర్ 20న విడుదల కానుంది. ఇప్పుడు పాయల్ బ్యూటీ ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకుందని సినీ వర్గాల్లో అనుకుంటున్నారు.

‘అనగనగా ఓ అతిథి’ సినిమాలో పాయల్ ‘మల్లిక’ అనే పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ తో పాయల్ ఈ సినిమాతో తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించిందని అర్థం అవుతోంది. ఇందులో ఆమె డైలాగ్ డెలివరీ.. హావభావాలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇప్పటి వరకు నటించిన సినిమాలలో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో నటించానని.. నటిగా తనని తాను ప్రూవ్ చేసే సినిమా ఇదేనని పాయల్ రాజ్ పుత్ స్ట్రాంగ్ గా నమ్ముతుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ సినిమా హిట్ అయితే అమ్మడి కెరీర్ మళ్ళీ ఊపందుకుని తెలుగులో మరిన్ని ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది. మరి పాయల్ కి ఈసారైనా హిట్ లభించి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారుతుందేమో చూడాలి.