కుర్రహీరో ఓన్లీ లేడీ డైరెక్టర్ తోనేనా?

0

తెలుగు పరిశ్రమలో మహిళా దర్శకులు ఎవరున్నారు? అంటే.. నందిని రెడ్డి అనే ఒకే ఒక్క పేరు వినిపిస్తోంది ఇటీవల. అది కూడా కొన్ని ఒడిదుడుకులు తట్టుకున్నఈ లేడీ డైరెక్టర్ ఓబేబి చిత్రంతో సక్సెస్ అందుకోవడం కలిసొచ్చింది. విజయ నిర్మల.. బి.ఏ.జయ ఇక లేరు. ఆ తర్వాత నందిని రెడ్డి మాత్రమే కాస్త నిలబడగలిగారు. ఇది ఒకింత గర్వపడే విషయమే అయినా.. ఆమె దర్శకత్వంపై తరచూ కాపీ క్యాట్ ఆరోపణలు ఎదురవ్వడం బ్యాడ్ టాక్ తెచ్చింది. తన సినిమాలను.. అందులోని సీన్లని ఇతర భాషల సినిమాల్లోనుంచి కాపీ చేస్తుందని ప్రచారమైంది.

ప్రతి సినిమాకి అలాంటి విమర్శలు తరచూ వినాల్సిన పరిస్థితి ఉంది. ఇటీవల ఆమె సమంతతో `ఓ బేబీ` చిత్రాన్ని రూపొందించారు. ఇది సౌత్ కొరియన్ చిత్రం `మిస్ గ్రానీ`కి రీమేక్. ఈ చిత్రంతో నందిని రెడ్డి మంచి ప్రశంసలందుకుంది. ఇందులో సమంత నటనకి ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద సత్తా చాటింది. ఓబేబి రిలీజై దాదాపు ఏడాది కావస్తుంది. కానీ ఇంకా నందిని రెడ్డి నెక్ట్స్ సినిమాకి సంబంధించి క్లారిటీ రాలేదు.

అయితే తాజా సమాచారం మేరకు ఆమె మళ్ళీ నాగశౌర్య తోనే సినిమా చేయనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఆయనతో `కళ్యాణ వైభోగమే` సినిమా చేసింది. ఇది అంతగా ఆకట్టుకోలేక పోయింది. ఇటీవల వచ్చిన `ఓ బేబీ`లోనూ కీలక పాత్రలో నాగశౌర్య నటించారు. మళ్ళీ ఆయనతోనే తన తదుపరి సినిమా చేసేందుకు నందిని ప్లాన్ చేస్తుందట. శౌర్యతో ఉన్న అనుబంధం వల్లే ఆయనతో మరో సినిమా చేస్తుందని ఓ వార్త వినిపిస్తుంటే.. నందినితో చేసేందుకు మరో హీరో ఆసక్తి చూపకపోవడం వల్లే తప్పని పరిస్థితుల్లో శౌర్యతో చేస్తుందనే కామెంట్స్ సోషల్ మీడియా లో నెటిజనుల నుంచి వినిపిస్తోంది. మరి ఇందులో నిజమెంతో గానీ.. ఈ కాంబినేషన్ ఓ లవ్ స్టోరీతో అభిమానుల ముందుకు రానున్నారట.

ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ అనుబంధ సంస్థ స్వప్న సినిమాస్ పతాకంపై ప్రియాంక దత్ నిర్మించనున్నారు. వీరి కాంబినేషన్ లో ఇప్పటికే `లస్ట్ స్టోరీస్` అనే వెబ్ సిరీస్ ని రూపొందించారు. ఈ సిరీస్ అవుట్ పుట్ బాగా రావడం తో నందినికి దత్ డాటర్ ఓ సినిమా ఛాన్స్ ఇచ్చారట. వరుస ఫ్లాపుల్లో ఉన్న నాగశౌర్య ఇటీవల `అశ్వథ్ధామ`తో యావరేజ్ అనిపించాడు. దీనికి నిర్మాత కం రైటర్ కూడా తనే అన్న విషయం విదితమే. ప్రస్తుతం మరో రెండు చిత్రాల్లో హీరోగా నటిస్తున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-