మళ్లీ లక్కీ హీరోయిన్ అనిపించుకుంటుందా ?

0

ప్రతిభ ఎంతున్నా హీరోయిన్ల సెలెక్షన్ విషయంలో ముందుగా చూసేది లక్కే. ఆ లక్ ఉన్న హీరోయిన్స్ చుట్టూనే దర్శక నిర్మాతలతో పాటు హీరోలు కూడా తిరుగుతుంటారు. టాలీవుడ్ లో అలా లక్కీ హీరోయిన్ అనిపించుకొని బడా సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది రశ్మిక. ‘ఛలో’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న ఈ భామ ఆ తర్వాత ‘గీత గోవిందంతో’ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.

అయితే ‘గీత గోవిందం’ తర్వాత ఈ అమ్మడికి ఇంక తిరుగులేదనుకునే సమయానికి సరిగ్గా ‘దేవదాస్”డియర్ కామ్రేడ్’ సినిమాలతో వరుస ఫ్లాపులు వచ్చాయి. అయితే ఆ సినిమాలు లెక్కచేయకుండానే వరుసగా రష్మికకు బడా అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం నితిన్ తో ‘భీష్మ’ చేస్తున్న రశ్మిక మరో వైపు ‘సరిలేరు నీకెవ్వరు’లో మహేష్ సరసన నటిస్తుంది. ఇక లేటెస్ట్ గా అల్లు అర్జున్ 20 సినిమాలో కూడా ఛాన్స్ అందుకుంది.

రశ్మిక నటిస్తున్న ఈ మూడు సినిమాలు వచ్చే ఏడాది రిలీజ్ కానున్నాయి. అయితే వీటిలో ముందుగా ‘సరిలేరు నీకెవ్వరు’ రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత ‘భీష్మ’ ఇక ఏడాది చివర్లో లేదా 2021 లో బన్నీ సుకుమార్ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ మూడు సినిమాలతో ఈ కన్నడ బ్యూటీ తెలుగులో మళ్లీ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకొని లక్కీ హీరోయిన్ అనిపించుకుంతుందా ? చూడాలి.
Please Read Disclaimer