సామ్ ఇప్పటికైనా స్పందించేనా…?

0

టాలీవుడ్ లో ఇప్పుడు కరోనా కలకలం రేపుతోంది. సినీ నిర్మాత నటుడు బండ్ల గణేష్ కి కరోనా పాజిటివ్ అని తేలడంతో సినీ ప్రముఖులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఈ క్రమంలో అక్కినేని నాగ చైతన్య – సమంత జంటకు కూడా కరోనా వైరస్ సోకిందంటూ ర్యూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. దీనికి కారణం ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ శిల్పా రెడ్డికి కరోనా పాజిటివ్ అని తేలడమే. శిల్పారెడ్డి అక్కినేని ఫ్యామిలీ ఫ్రెండ్. ఈమె సమంతకు క్లోజ్ ఫ్రెండ్ కూడా. దీనికి తోడు ఇటీవల శిల్పారెడ్డి సమంత ఇంటికి వచ్చి కలిశారు. అంతేకాకుండా సమంత ఆమె ముద్దు కూడా పెట్టుకుంది. ఆ ఫోటో సమంత సోషల్ మీడియాలో స్వయంగా షేర్ చేసారు. ఆ తర్వాత శిల్పా రెడ్డికి కరోనా పాజిటివ్ అని తేలింది.

దీంతో సమంతకు కూడా కరోనా వచ్చిందంటూ ప్రచారం మొదలైంది. సమంత నుంచి చైతూకు కూడా వైరస్ సోకుండొచ్చని వార్తలొచ్చాయి. దాంతో వారి అభిమానులు కూడా కంగారు పడ్డారు. ఇప్పుడు అందులో నిజం లేదని.. చెయ్ – సామ్ ఇద్దరూ కరోనా నిర్ధారణ టెస్టులు చేయించుకున్నారని.. కరోనా నెగిటివ్ వచ్చి వారికి మహమ్మారి సోకలేదని వార్తలొస్తున్నాయి. ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియదు కానీ అక్కినేని అభిమానులు మాత్రం హ్యాపీగా ఉన్నారు. అయితే సమంత ఈ వార్తలపై ఎందుకు స్పందించలేదు అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్.

సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే సమంత ప్రతి విషయంపై స్పందిస్తుందని అందరికీ తెలిసిన విషయమే. తనపైన తన సినిమాల పైన ఏదైనా ర్యూమర్ వచ్చిందంటే సమంత వెంటనే స్పందిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టి క్లారిటీ ఇచ్చేస్తారు. అయితే చెయ్ – సామ్ కి కరోనా సోకిందనే విషయంపై ఎందుకు రియాక్ట్ అవలేదో అని డౌట్ వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇవేమీ పట్టించుకోని సామ్ ఈ రోజు తన భర్త నాగ చైతన్య తో కలిసి యోగా చేస్తున్నానని చెప్తూ ఓ ఫోటో షేర్ చేసింది. సమంత పై వస్తున్న ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చి ఫ్యాన్స్ లో నెలకొని ఉన్న భయాన్ని తొలగిస్తుందేమో చూడాలి.
Please Read Disclaimer