ఇలాంటి పరిస్థితుల్లో థియేటర్స్ ఓపెన్ చేయాలా?

0

లాక్ డౌన్ కఠిన నిబంధనల్నీ జూన్ 1 వరకు కొనసాగాయి. జూన్ 1 తర్వాత అన్ లాక్1 మొదలైంది. వ్యాపారాలు దుకాణాలు పరిశ్రమలు కంపెనీలు అన్ని మొదలయ్యాయి. జనాలు అంతా రోడ్లమీదకొచ్చారు. ఒక్క థియేటర్లు పార్క్ లు జిమ్ లకు అనుమతులు ఇవ్వలేదు. సినీ పరిశ్రమకు షూటింగ్ లకు పోస్ట్ ప్రొడక్షన్ కు అనుమతిచ్చారు. సీరియళ్లు ఆల్ రెడీ పట్టాలెక్కాయి. సినిమాలు మాత్రం షూటింగ్ చేయడానికి ఇంకా భయపడుతున్నారు.అయితే జూన్ 1నుంచే దేశంలో కరోనా వ్యాప్తి మొదలైంది. జనాలంతా రోడ్లపైకి రావడంతో కరోనా తీవ్రత పెరుగుతూ వస్తున్నాడు. నేడు దాదాపు ఒక్కరోజులోనే దేశంలో 15వేల కేసులు తెలంగాణలో ఒక్కరోజులోనే 730 దాకా కేసులు నమోదయ్యాయి. కరోనా తీవ్రత ఇంకా పెరిగే చాన్స్ లు కనిపిస్తున్నాయి. పీక్ స్టేజికి దగ్గరలోనే పరిస్థితి ఉంది.ఈ క్రమంలోనే అమెరికాలో వచ్చే 15 తరువాత థియేటర్స్ ఓపెన్ చేయడానికి అనుమతిచ్చారు. ఇప్పుడు సీరియళ్లు సినిమాల షూటింగ్ మొదలు కావడంతో మరి భారత్ లోనూ జూలైలో సినిమా థియేటర్లకు అనుమతి దిశగా కేంద్రం ఆలోచిస్తోంది. అయితే అది ఎంత మాత్రం సేఫ్ కాదని ప్రస్తుత పరిస్థితి కళ్లకు కడుతోంది.

జనసమూహాలు అత్యధికంగా గుమిగూడే ప్రాంతాలు థియేటర్లు పార్కులు జిమ్ లు.. ఇప్పటికే రోడ్లమీదకు వస్తున్న జనాలతో కరోనా జెట్ స్పీడులా దూసుకెళుతోంది. అదే థియేటర్స్ ఓపెన్ చేస్తే ఊహకందని రీతిలో కరోనా ప్రబలే ప్రమాదం పొంచి ఉంది. ఒత్తిళ్లకు తలొగ్గి ప్రభుత్వం వీటికి అనుమతిస్తుందా? కరోనా విలయాన్ని చూస్తుందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Please Read Disclaimer