విశ్వక్ సినిమాకు చరణ్ సినిమాతో లింక్?

0

యాక్టింగ్ కంటే తన యాటిట్యూడ్ తో హాట్ టాపిక్ అయ్యే హీరోలలో యువ హీరో విశ్వక్ సేన్ ఒకరు. ఈమధ్యే విశ్వక్ ‘హిట్’ సినిమాతో ఓ విజయం సొంతం చేసుకున్నాడు. ఆ సినిమా హిట్టుతో ఊపు మీద ఉన్న విశ్వక్ ‘పాగల్’ అనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈమధ్యే ‘పాగల్’ లాంచ్ అయింది. ఈ సినిమా కథ గురించి ఓ ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమా కథ రామ్ చరణ్ ‘ఆరెంజ్’ స్టోరీని పోలి ఉంటుందట. ఈ సినిమాలో విశ్వక్ చాలామంది అమ్మాయిలతో ప్రేమలో పడుతూ లేస్తూ ఉంటాడట. అయితే ‘ఆరెంజ్’ సినిమాలో కామెడీ పెద్దగా ఉండదు.. ఈ లవ్ ట్రాక్స్ ఎక్కువగా ఉంటాయి. ‘పాగల్’ మాత్రం అందుకు భిన్నంగా ఫుల్ కామెడీతో కొనసాగుతుందట. ఇదంతా బాగానే ఉంది కానీ ఈ ప్రేమ కథలు.. కామెడీ విశ్వక్ కు ఎంతమాత్రం సూట్ అవుతాయి అనేది వేచి చూడాలి. ఆ విషయం సినిమా విడుదలైతే కానీ మనకు తెలియదు.

ఇదిలా ఉంటే విశ్వక్ చివరి సినిమా ‘హిట్’ విజయం సాధించింది కానీ ట్రేడ్ వర్గాలు అంచనా వేసిన రేంజ్ కలెక్షన్స్ రాలేదు. దీనికి కారణం విశ్వక్ కేర్లెస్ యాటిట్యూడ్ అనే వాదన వినిపిస్తోంది. హీరో అన్న తర్వాత అన్ని సెక్షన్ల ఆడియన్స్ దగ్గర మంచి మార్కులు తెచ్చుకోవాలని.. కేర్లెస్ యాటిట్యూడ్ యూత్ కు నచ్చినప్పటికీ మిగతా సెక్షన్లకు దూరమయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు.మరి ఈ సంగతి విశ్వక్ గ్రహిస్తాడో లేదో.!
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-