‘అల’ వాళ్ళిద్దరూ కనిపిస్తారా బన్నీ ?

0

అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ నుండి రేపు మూడు సాంగ్ టీజర్ రిలీజ్ కానుంది. ముందుగా టీజర్ వదిలి కొన్ని రోజుల తర్వాత ఫుల్ ఆడియో సాంగ్ రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. అయితే ఇప్పటికే సినిమాలో రెండు పాటలు పెద్ద హిట్టవ్వడం మిలియన్ వ్యూస్ సాదిస్తూ దూసుకుపోతుండటంతో ఈ సాంగ్ పై భారీ అంచనాలు నెలకొంటున్నాయి.

అయితే రేపు బాలల దినోత్సవం సందర్భంగా రిలీజ్ కానున్న ఈ సాంగ్ టీజర్ ఇద్దరు గెస్ట్ అప్పిరియన్స్ ఇవ్వనున్నారని ఓ లీక్ వదిలారు మేకర్స్. చిల్డ్రన్స్ డే అవ్వడం పైగా OMGDaddy అంటూ డాడీ మీద వచ్చే సాంగ్ కావడంతో ఆ గెస్టులు మరెవరో కాదు బన్నీ ఇద్దరు పిల్లలే అని తెలుస్తుంది. అల్లు అయాన్ అల్లు ఆర్హ టీజర్ లో కనిపించి ఈ సాంగ్ కి ఎట్రాక్షన్ గా నిలవనున్నారని సమాచారం.

మరి ఈ సాంగ్ టీజర్ లో నిజంగానే బన్నీ తో కలిసి అల్లు వారసులు కనువిందు చేస్తారా అన్నది మరి కొన్ని గంటల్లోనే తెలిసిపోతుంది. రేపు ఉదయం పది గంటలకు ఈ సాంగ్ టీజర్ యూట్యూబ్ లో విడుదల కానుంది. మరి ఈ సాంగ్ తో బన్నీ భారీ వ్యూస్ తో మరో రికార్డు నెలకొల్పుతాడనే అనిపిస్తుంది.
Please Read Disclaimer