చెమటలు పట్టిస్తున్న ఈ అమ్మడు ఎవరు?

0

మల్లూవుడ్ గాళ్స్ నుంచి కాంపిటీషన్ ఏ రేంజులో ఉంటుందో చెప్పాల్సిన పనే లేదు. అందానికి అందం ప్రతిభతో ఈ భామలు అన్ని పరిశ్రమల్లోనూ దూసుకుపోతున్నారు. నయనతార- నిత్యామీనన్ మొదలు కీర్తి-నివేద థామస్ వరకూ ఎందరో భామలు నిరంతరం ఈ ఫ్లో కొనసాగుతూనే ఉంది. ఈ వెల్లువలోనే మరో అందగత్తె తెలుగు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధం చేసేందుకు వస్తోంది.

ఈ అమ్మడు ఎవరు? అని ఆరా తీస్తే.. పేరు ఇనియ. భారీ ఎపిక్ చిత్రం ‘మమాంగం’తో ట్రీటిచ్చేందుకు వస్తోంది. తమిళం మలయాళంలో వరుసగా భారీ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు లీలా అనే చిత్రంతో తెలుగు వారికి పరిచయమైంది. అయితే అప్పుడు అంతగా నోటీస్ కాలేదు. అయితే ఈసారి ఏకంగా మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి సరసన నటించేస్తోంది. పైగా మమాంగం లాంటి ఎపిక్ చిత్రంతో వస్తోంది కాబట్టి తెలుగు కుర్రాళ్లలోనూ హాట్ టాపిక్ గా మారనుంది.

మమాంగం చిత్రంలో ఇనియ రొమాన్స్ అదిరిపోనుందని తాజాగా రివీలైన ఫోటోల్ని బట్టి అర్థమవుతోంది. ఈ అమ్మడు ట్రైలర్ లోనూ చెమటలు పట్టిన దేహంతో అందరికీ చెమటలు పట్టించేసింది. మరి పూర్తి స్థాయి సినిమాలో ఏ రేంజులో కనువిందు చేయనుందో అంటూ ఊహాల్లో తేలిపోతున్నారు. మమాంగం తెలుగు-తమిళం-మలయాళంలో భారీగా రిలీజ్ కానుంది.
Please Read Disclaimer