భార్య ముందు ప్యాంట్ విప్పేసి.. స్టార్ సింగర్ ఫొటో వైరల్

0

కెనడియన్ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ ఇటీవల పెళ్లి చేసుకున్నాడు. అమెరికన్ మోడల్ అయిన హెయిలీ బాల్డ్‌విన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. గతేడాది వీరిద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోగా.. అక్టోబర్‌లో కుటుంబ సమక్షంలో మరోసారి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అప్పటినుంచి వీరిద్దరూ తమ కొత్త దాంపత్య జీవితాన్ని తెగ సంతోషంగా గడిపేస్తున్నారు. రోజుకో ఫొటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే జస్టిన్ బీబర్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ప్రముఖ ఇంటర్నేషనల్ లాంజరీ బ్రాండ్ అయిన కాల్విన్ క్లైన్ తరఫున జస్టిన్ ప్రచారం చేస్తున్నాడు.

ఈ నేపథ్యంలో బీబర్ తన భార్యను కౌగిలించుకుని ప్యాంట్ విప్పుతున్నట్లుగా పోజిచ్చాడు. ఈ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో రచ్చపుట్టిస్తోంది. పైగా ఈ ఫొటోకు క్యాప్షన్‌గా.. ‘నా భార్యకు క్రిస్మస్ కానుక రెడీ’ అని పేర్కొన్నాడు. ఈ ఫొటోను నలభై లక్షల మందికి పైగా లైక్ చేశారు. విదేశాల్లో ఇలాంటి ఫొటో షూట్లు కామనే. కానీ ఇదే ఫొటో షూట్‌ను మన ఇండియాలో ఏ సెలబ్రిటీ అయినా దిగి ఉంటే అట్టుడికిపోయేది. ఇప్పటికే కాల్విన్ క్లైన్ బ్రాండ్‌కు భారతీయ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న దిశా పటానీ తన సెక్సీ్ ఫొటో షూట్లతో ఇన్‌స్టాగ్రామ్‌కు జ్వరమొచ్చేలా చేస్తున్నారు. ఏదేమైనా క్రిస్మస్ సందర్భంగా బీబర్ తన అభిమానులకు హాట్ ఫొటోతో సర్‌ప్రైజ్ ఇచ్చాడనే చెప్పాలి.

 

View this post on Instagram

 

My gift this year @haileybieber #mycalvins

A post shared by Justin Bieber (@justinbieber) on
Please Read Disclaimer