పోలీస్ స్టేషన్ కు చేరిన బూత్ పోస్టర్ల పంచాయతీ

0

మాంచి స్పైసీ కథాంశంతో పాటు రొమాంటిక్ సినిమాలు.. బట్టలు ఎంత తక్కువుంటే అంత హిట్టవుతాయనే ఉద్దేశంతో కొన్ని సినిమాలు విడుదల చేస్తుంటారు. ఎలాంటి కట్ లు – బీప్ సౌండ్లు లేకుండానే ఈ నడి మధ్య సినిమాలు వచ్చేస్తున్నాయి. పడక గదిలో జరిగే క్రియలన్నీ థియేటర్ లో కనిపించేలా వస్తున్న సినిమాలు రూపొందించేందుకు కొందరు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆ నేపథ్యంలోనే కొన్ని సినిమాలు వచ్చి హిట్ కొట్టాయి.. మరికొన్ని ప్రేక్షకులకు తెలియకుండాపోయినవి కూడా. ఇదే బూతు నేపథ్యంలో రూపుదిద్దుకున్న సినిమా ‘డిగ్రీ కాలేజి’. విడుదలైన ఈ సినిమా ట్రైలర్ లో చూస్తే మొత్తం ఆ దృశ్యాలే కనిపిస్తాయి. టేబుల్ పైనే చేయడం – ఇసుకలో ఇద్దరు నగ్నంగా నిద్రించడం తదితర సీన్లు యూత్ ను బూతులో ముంచేయగా.. కొందరు అర్ధరాత్రి ఎవరికీ తెలియకుండా ట్రైలర్ చూశారు. ఈ ట్రైలర్ మాదిరిగా ఈ సినిమా పోస్టర్లు మన పరిసర ప్రాంతాల్లో దర్శనమిస్తున్నాయి. అయితే ఈ పోస్టర్ల పంచాయతీ పోలీస్ స్టేషన్ కు చేరింది.

నిర్మాత – దర్శకులపై కేసు

బూతు కంటెంట్ తో వస్తున్న సినిమాల పోస్టర్లను బహిరంగంగా అతికిస్తే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తామని చెబుతూ ‘డిగ్రీ కాలేజి’ సినిమా దర్శకుడు – నిర్మాతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ లోని ఎస్ఆర్ నగర్ పోలీసులు ‘డిగ్రీ కాలేజి’ సినిమాలోని అశ్లీల పోస్టర్లు అమీర్ పేట మైత్రివనమ్ కూడలిలో దర్శనమిచ్చాయి. రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో అశ్లీల చిత్రాలు ఉండడం.. బహిరంగంగా ఇలాంటి పోస్టర్లు అతికించడం తప్పు కావడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. అశ్లీల పోస్టర్లు అతికించడంతో ఆ సినిమా దర్శకుడు – నిర్మాతలపై ఎస్ ఆర్ నగర్ ఇన్ స్పెక్టర్ మురళీకృష్ణ కేసు నమోదు చేశారు. టాస్క్ఫోర్సు పోలీసులు నినిమా దర్శకుడు నర్సింహ నంది – నిర్మాత శ్రీనివాస్ రావులను అదుపులోకి తీసుకుని ఎస్ ఆర్ నగర్ పోలీసులకు అప్పగించారు.

ఈ సినిమా శ్రీలక్ష్మీ నరసింహ బ్యానర్ పై వరుణ్ – దివ్యారావు హీరో హీరోయిన్లుగా నర్సింహ నంది దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఫిబ్రవరి 7వ తేదీన విడుదల చేసే సమయంలో ఈ చిత్ర బృందానికి పోలీసులు షాకిచ్చారు. వారిద్దరి అరెస్టుతో మరి సినిమా విడుదలవుతుందో లేదో చూడాలి.
Please Read Disclaimer