సూపర్ స్టార్ ను కనిపిస్తే కొట్టేలా ఉన్నారు

0

ప్రస్తుతం బాలీవుడ్ లో అత్యధికంగా సంపాదిస్తున్న హీరో.. అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ లను చేస్తున్న హీరో ఎవరు అంటే ఠక్కున వినిపించే పేర్లలో ముందు వరుసలో అక్షయ్ కుమార్ ఉంటాడు అనే విషయం తెల్సిందే. అక్షయ్ కుమార్ ఏడాదిలో మూడు నాలుగు సినిమాలు చేస్తున్నాడు. గత సంవత్సరం ఈయన నటించిన సినిమాలు ఏకంగా 700 కోట్ల వరకు వసూళ్లు సాధించాయనే విషయం తెల్సిందే. ఒక వైపు ఇలా జోరుగా సినిమాలు చేస్తూనే మరో వైపు లెక్కకు మించిన యాడ్స్ లో నటిస్తూ ఉంటాడు. మరో వైపు వెబ్ సిరీస్ లు మరియు రియాల్టీ షోల్లో కూడా పాల్గొంటూ నటిస్తూ ఉంటాడు.

ఇటీవల నిర్మా డిటర్జంట్ పౌడర్ యాడ్ లో అక్షయ్ కుమార్ నటించాడు. ఆ బ్రాండ్ కు సంబంధించి దాదాపు రెండు నిమిషాల నిడివి గల ఒక యాడ్ ను చిత్రీకరించాడు. ఆ యాడ్ లో అక్షయ్ కుమార్ ఒక రాజులా కనిపిస్తాడు. రాజు తన సైనికులతో యుద్దంకు వెళ్లి వస్తూ ఉంటాడు. రాణి గారు మరియు ఇతర మహిళలు యుద్ద వీరులకు మంగళహారతులతో స్వాగతం పలుకుతారు. అలాంటి సమయంలోనే యుద్దం చేసిన వచ్చిన రాజు మరియు సైనికుల డ్రస్ లు చాలా మురికిగా ఉంటాయి.

ఆ మురికి బట్టలను తాము ఉతకలేము అంటూ మహిళలు అనడంతో రాజు అయిన అక్షయ్ కుమార్ మరియు సైనికులు తమ డ్రస్ లను వారే నిర్మ వాషింగ్ పౌడర్ తో క్లీన్ చేసుకుంటారు. ఒక రాజు అయ్యి ఉండి ఇలా డ్రస్ లను క్లీన్ చేసుకోవడం ఏంటీ అంటూ చాలా మంది అనుకుంటున్నారు. ఈ యాడ్ పై చత్రపతి శివాజీ మహారాజ్ అభిమానులు తీవ్రంగా మండి పడుతున్నారు. ప్రస్తుతం అక్షయ్ కుమార్ బయట కనిపిస్తే దాడి చేయాలనేంత కోపంతో వారు ఉన్నారు.

రాజు అనే వ్యక్తి హుందాగా ఉండాలి. రాజును అవమానించేలా ఈ యాడ్ లో చూపించారు అని.. దీన్ని చత్రపతి శివాజీ మహారాజ్ అభిమానులు తీవ్రంగా ఖండిస్తున్నారు అంటూ ఆందోళనలు మొదలు అయ్యాయి. ఇదే సమయంలో శివాజీ మహారాజ్ అభిమానులు కొందరు పోలీసులకు ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగింది. నిర్మ కంపెనీ మరియు ఆ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న అక్షయ్ కుమార్ లపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై పోలీసులు మరియు కోర్టు ఎలా స్పందిస్తారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Please Read Disclaimer