క్యాస్టింగ్ కోచ్ టాలీవుడ్ లో ఇంకా ఉందట

0

క్యాస్టింగ్ కోచ్.. లైంగిక వేధింపులు.. #మీటూ ఉద్యమం ఇలా పేర్లు రకరకాలుగా ఉండొచ్చు కానీ అల్టిమేట్ గా దానర్థం ఒకటే మహిళలను వర్క్ ప్లేస్ లో వేధించడం. ఇది అన్నీ చోట్లా.. అన్ని ఇండస్ట్రీలలో ఉంది కానీ ఫిలిం ఇండస్ట్రీ మాత్రం ఎక్కువగా హైలైట్ అవుతుంది. కారణం ఇది గ్లామర్ ఇండస్ట్రీ కావడం.. సెలబ్రిటీలు ఎప్పుడూ లైమ్ లైట్ లో ఉండడమే. గత కొంతకాలంగా ఈ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎక్కువ కావడంతో చాలామంది సెలబ్రిటీల ఇమేజ్ డ్యామేజ్ అయింది. అధికశాతం ఆరోపణలలో ప్రూఫులు లేకపోవడంతో ఆరోపణలు చేసేవారికి వెయిటేజ్ ఉండడం లేదు. ఏదేమైనా #మీటూ దెబ్బకు చాలామంది మగమహారాజులు మహిళల జోలికి పోవాలంటే భయపడ్డారన్నది నిజం.

మిగతా అన్ని ఇండస్ట్రీలలో ఈ ఆరోపణలు తారాస్థాయిలో ఉన్నాయి కానీ టాలీవుడ్ లో మాత్రం లేవు. కొంతమంది నటీమణులు టాలీవుడ్ సెలబ్రిటీలపై ఆరోపణలు చేసినా అవి సాధారణ ప్రజలు నమ్మే స్థాయిలో అయితే లేవు. అలా అని టాలీవుడ్ సెలబ్రిటీలు శుద్దపూసలు అని ఎవరూ అనుకోవడం లేదన్నది కూడా నిజం. అయితే బయటకు రావడం లేదు అంతే. రీసెంట్ గా ఒక ప్రొడ్యూసర్ పుత్రరత్నం… ఈయన కూడా ప్రొడ్యూసరే.. ఒక వర్థమాన హీరోయిన్ కు ఇలాంటి ఇండీసెంట్ ప్రపోజల్ ఇచ్చాడట. #మీటూ అంటే ఈ కుర్ర నిర్మాతకు అసలు భయమే లేదు కాబోలు.. డైరెక్ట్ గానే ‘కమిట్మెంట్’ అడిగాడట. కమిట్మెంట్ కు సరే అంటేనే హీరోయిన్ ఆఫర్. కానీ ఆ హీరోయిన్ ఒప్పుకోలేదట. సో.. ఆ సినిమా ఆఫర్ మిస్ అయింది.

అంతటితో ఈ ఎపిసోడ్ అయిపోలేదని.. ఈ కుర్ర నిర్మాతకు సంబంధించిన వారి బ్యానర్ లోనే వేరే సినిమాకు సేమ్ హీరోయిన్ సెలెక్ట్ అయిందట. హీరోయిన్ గా ఫిక్స్ అయిన తర్వాత కూడా తనకు హీరోయిన్ ఆఫర్ దక్కకుండా వెనకనుంచి ఆపుతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ యంగ్ ప్రొడ్యూసర్ కు తగిలిన హీరోయిన్లు అందరూ సాదాసీదాగా ఉన్నారని.. సరైన టెంకె(దేశముదురు లాంటి మహిళను.. కంత్రీని అలా పిలుచుకుంటారు లెండి) తగిలితే మాత్రం లాక్కోలేక పీక్కోలేక చస్తాడని ఆఫ్ లైన్ కామెంట్లు వినిపిస్తున్నాయి.Please Read Disclaimer