హాలీవుడ్ హాటీ తో క్యాట్ కాంపిటీషన్

0

నటన.. డ్యాన్సులు.. ఎంచుకునే ఫ్యాషన్స్ ఇలా ప్రతి దాంట్లో కొందరి కి స్ఫూర్తి ఉంటుంది. ఫలానా హాలీవుడ్ స్టార్ ఫలానా డ్రెస్ తొడుక్కుంటే వండర్ ఫుల్ గా ఉందని అలాంటి డ్రెస్ తనకు కూడా కావాలని కోరుకోవడం సహజం. అంతేకాదు కొందరు భామలు అయితే అచ్చం అలాంటి డిజైన్ రెడీ చేయమని తమ డిజైనర్ల కు చెబుతుంటారు. ఇదిగో ఇక్కడ కత్రిన కూడా అదే చేసినట్టుంది.

ఇటీవల జీక్యూ మెన్ ఆఫ్ ది ఇయర్ 2019 అవార్డ్స్ కార్యక్రమం లో పాల్గొన్న కత్రిన అక్కడ అదిరి పోయే డిజైనర్ డ్రెస్ తో తళుక్కుమంది. ఇండస్ట్రీ టాప్ డిజైనర్ నయీమ్ ఖాన్ ఈ డ్రెస్ ని డిజైన్ చేశారు. వెండి సీక్విన్ లైనింగ్ ఉన్న ఒక నల్ల ప్యాంట్ సూట్ లో కత్రిన ఆకట్టు కోగా.. టాప్ లో ఇలా టూమచ్ గా ఓపెన్ చేసి వేడెక్కించింది. డిజైనర్ షెహ్లా ఖాన్ చేత ప్రత్యేకించి లేస్ బ్రాలెట్ ను డిజైన్ హైలైట్ గా నిలిచింది. ఈ లుక్ అల్ట్రా సెక్సీ అప్పియరెన్స్ ని ఎలివేట్ చేసింది. ఆ హెయిర్ ను సింపుల్ గా వదిలేసినా.. మత్తెక్కించే కళ్లతో అగ్గి రాజేసింది. కత్రిన మేకప్ లెస్ లుక్ మరో హైలైట్.

అయితే ఆసక్తికరంగా సేమ్ టు సేమ్ డ్రెస్ లో ఇటీవల వేరొక ఈవెంట్ లో ప్రఖ్యాత హాలీవుడ్ నటి కోర్ట్నీ కర్ధాషియన్ కనువిందు చేసింది. ప్రఖ్యాత పీపుల్స్ ఛాయిస్ అవార్డు ల కోసం కోర్ట్నీ కర్దాషియాన్ ఈ డిజైనర్ లుక్ లో కనిపించింది. సేమ్ టు సేమ్ సిల్వర్ లైనింగ్ ఛమ్మీలు .. చారలు ఉన్న డిజైనర్ డ్రెస్ లో ఓ కార్యక్రమం లో తళుకు బెళుకులు ప్రదర్శించింది. దీంతో కోర్ట్నీ – కత్రిన ఇద్దరినీ పోల్చి చూస్తూ నెటిజనులు వేడెక్కించే కామెంట్లు చేస్తున్నారు. ఒకరి ని చూసి ఇంకొకరు స్ఫూర్తి పొందడం అన్నది రెగ్యులర్ గా చూస్తున్నదే. ఇక డిజైనర్లు ఫలానా డిజైన్ ని ఫాలో అయితే ఎలా ఉంటుంది? అన్న తపన తోనూ ఉంటారు. అలా ఈ ఇద్దరి లుక్ ఒకేలా చూపించారన్నమాట. ఇక ఇలానే కాపీ చేస్తే కాపీ క్యాట్ అంటారేమో! కాస్త ఆలోచించాలి మరి.
Please Read Disclaimer