చిరంజీవి ఇంట్లో సినీ ప్రముఖుల భేటి.. బాలయ్య వ్యాఖ్యలే ఎజెండానా?

0

టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దదిక్కు గా మారిన మెగా స్టార్ చిరంజీవి ఇంట్లో సినీ ప్రముఖుల తాజా భేటి ఉత్కంఠ రేపుతోంది. సినిమాల షూటింగ్ థియేటర్ల ఓపెనింగ్స్ పై కొద్దిరోజులుగా తెలంగాణ ప్రభుత్వంతో సినీ పెద్దలు భేటి అయ్యారు. ఈ భేటికి తనను పిలువలేదని.. భూములు పంచుకోవడానికే ఈ మీటింగా? అని అగ్రహీరో బాలయ్య నిన్న సంచలన విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలు సినీ రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి.

ఈ నేపథ్యంలో ఈరోజు చిరంజీవి ఇంట్లో మరోసారి సినీ ప్రముఖుల భేటి సర్వత్రా ఆసక్తి రేపుతోంది. సీనీ కార్మికుల రెండో విడత సాయంపై చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు.

అయితే ఈ సమావేశంలోనే బాలక్రిష్ణ చేసిన వ్యాఖ్యలు బాలయ్యకు మెగా బ్రదర్ నాగబాబు ఇచ్చిన కౌంటర్ కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశం అనంతరం బాలయ్య వ్యాఖ్యలపై చిరంజీవి కూడా స్పందించే అవకాశమున్నట్లు సమాచారం.
Please Read Disclaimer