పిట్టకథను నెత్తినెత్తుకున్న టాలీవుడ్ స్టార్స్

0

‘ఓ.. పిట్టకథ’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఈ సినిమాతో నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమాకు గతంలో ఏ చిన్న సినిమాకు కూడా రాన్నంత పబ్లిసిటీ వచ్చింది. బ్రహ్మాజీకి ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఆయన పలువురు స్టార్ హీరోల సినిమాల్లో నటించడంతో పాటు వారితో మంచి స్నేహంను ఏర్పర్చుకున్నారు. అందుకే చిరంజీవి నుండి వెన్నెల కిషోర్ వరకు ఎంతో మంది స్టార్స్ ఈ సినిమాను నెత్తిన పెట్టుకుని మరీ ప్రమోట్ చేశారు.

సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి హాజరు అవ్వడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. టీజర్.. టైలర్.. పాటలు.. ఫస్ట్ లుక్ ఇలా ప్రతి ఒక్కటి కూడా ఒక్కో సెలబ్రెటీ చేతుల మీదుగా విడుదల చేయించడం తో గత కొన్ని రోజులుగా ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతూనే ఉంది. నేడు విడుదల సందర్బం గా కూడా పలువురు సెలబ్రెటీలు సినిమా కు మరియు సంజయ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

ఓ పిట్టకథకు శుభాకాంక్షలు చెప్పిన వారిలో మెగాస్టార్ చిరంజీవి.. సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఎన్టీఆర్.. ప్రభాస్.. రానా.. నాని.. పూరి.. వర్మ.. మంచు మనోజ్.. కొరటాల శివ.. త్రివిక్రమ్.. అనీల్ రావిపూడి.. హరీష్ శంకర్.. వెన్నెల కిషోర్.. పూజా హెగ్డే.. నభా నటేష్.. రకుల్ ప్రీత్ సింగ్.. టబు.. మంచు లక్ష్మి.. హెబ్బా పటేల్ ఇలా పలువురు ప్రముఖులు ఉన్నారు. సినిమాకు ప్రమోషన్ అయితే బాగానే దక్కింది. అయితే ప్రమోషన్ తో సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకు వెళ్లారు కాని ఫలితం ఏంటీ అనేది చూడాలి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-