100M వ్యూస్.. కాలేజ్ ఫ్యాన్స్ సెలబ్రేషన్

0

బన్ని కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ హ్యాట్రిక్ ని అందుకోబోతోందా? అంటే అవుననేంత ఊపు కనిపిస్తోంది. `అల వైకుంఠపురములో` సినిమాకి సంబంధించిన ప్రతి పాటా.. ప్రతి ఫోటో.. ప్రతి వీడియో సామాజిక మాధ్యమాల్లో జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది. డిసెంబర్ ఆద్యంతం బన్ని టీమ్ ప్రచారాన్ని ఓ రేంజులో హోరెత్తించబోతోందని అర్థమవుతోంది.

ఇక ఈ చిత్రం నుంచి రిలీజైన సామజవరగమన సంచలనాల గురించి తెలిసిందే. 10 కోట్ల (100 మిలియన్) వ్యూస్ ని సాధించిన రేర్ సాంగ్ ఇది. థమన్ మెలోడీ నిమిషాలు గంటల్లోనే ఆన్ లైన్ లో దుమారం రేపింది. చాలా కాలం తర్వాత అదిరిపోయే కంపోజిషన్ అంటూ ప్రశంసలు కురిశాయి. ఇక ఇదే ఉత్సాహంలో థమన్ ఇతర బాణీల్ని అంతే అందంగా తీర్చిదిద్దుతున్నారన్న సమాచారం ఉంది. బన్ని టీమ్ ట్రైలర్ ట్రీట్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.

సామజవరగమన బ్లాక్ బస్టర్ ట్యూన్ 100 మిలియన్ల వ్యూస్ సాధించిన సందర్భంగా కాలేజ్ లలో స్టూడెంట్స్ ఫీవర్ ఏ రేంజులో ఉందో ఎలివేట్ చేస్తూ తాజాగా సోషల్ మీడియాల్లో ఓ వీడియో వైరల్ అయ్యింది. దీనిని హారిక సంస్థ అధికారిక సమాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. థమన్ బాణీ కాలేజ్ కుర్రాళ్లలో ప్రణయం పుట్టించిందని ఆ వీడియో చూస్తుంటే అర్థమవుతోంది. అల్లు అర్జున్ పై కాలేజ్ యూత్ తమ అభిమానం చాటుకోవడం ఆసక్తికరం. కాన్సెప్ట్ కాంటెస్ట్ ఇంట్రెస్టింగ్. ఈ వీడియోల్లో కాలేజ్ ప్రేమికులు ఓపెన్ గా దొరికిపోయారనే చెప్పాలి. మొత్తానికి సామజవరగమణ పాటను స్టూడెంట్స్ వోన్ చేసుకున్న తీరు అందరికీ ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది. ఈ క్రేజీ గీతాన్ని సిధ్ శ్రీరామ్ ఆలపించిన సంగతి తెలిసిందే.




Please Read Disclaimer