#కరోనా వెకేషన్స్: సెలబ్రిటీ అందాలకు సర్జరీల సీజన్!

0

కరోనా వైరస్ ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సంగతి తెలిసిందే. వైరస్ ప్రభావం రోజు రోజుకి తీవ్రమవుతోంది. ఆదివారం వరకు మన దేశంలోనే ఏడుగురు చనిపోయారు. వైరస్ బారిన పడిన వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. మన దేశంలో కరోనా బాధితులు దాదాపు నాలుగు వందలకు చేరింది. ప్రపంచ వ్యాప్తంగా మూడు లక్షల 32వేల మంది దీని బారిన పడగా.. సుమారు 14.500 మంది మృత్యువాత పడ్డారు. ఇంతటి భయంకరమైన వైరస్ తో ప్రపంచదేశాలు ఎక్కడికెక్కడ లాక్ డౌన్ ప్రకటిస్తున్నాయి. మన దేశంలో 75 జిల్లాల్లో లాక్ డౌన్ విధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా.. ఈ నెల 31 వరకు తెలంగాణ.. ఏపీని లాక్ డౌన్ చేస్తున్నట్టు రెండు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్.. జగన్ ప్రకటించారు. దీంతో రాజకీయ నాయకులతోపాటు సెలబ్రిటీలు అన్ని బంద్ చేసుకుని ఇంటికే పరిమితమవుతున్నారు. అయితే ఇదే అదనుగా భావించిన కొంత మంది సినీ సెలబ్రిటీలు తమ పెండింగ్ పనులను కంప్లీట్ చేసుకునే పనిలో బిజీ అయ్యారు.

సినీ తారలకు అందం ముఖ్యం. తెరపై వారు అందంగా కనిపిస్తేనే అభిమానులు బాగా ఆదరిస్తారు. వారి కోసం నిత్యం అందంగా కనిపించేందుకు తారలు పెట్టే శ్రద్ధ అంతా ఇంతా కాదు. కరోనా కారణంగా ఖాళీ దొరకడంతో తమ బాడీలో ఉన్న లోపాలను సరిచేసుకునే పనిలో పడ్డారు. ప్లాస్టిక్ సర్జరీలకు ఇదే సరైన సమయమని భావిస్తూ వాటిని సెట్ చేసుకునే పనిలో బిజీ అవుతున్నారు.

ప్రస్తుతం హాలీవుడ్ సెలబ్రిటీలంతా ప్లాస్టిక్ సర్జరీ చేసే క్లినిక్ లు.. హస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. వీటి చుట్టూ తారలంగా క్యూ కడుతున్నారట. దీనిపై ప్రముఖ అమెరికన్ ప్లాస్టిక్ సర్జన్.. కో-హోస్ట్ బోట్చన్ టెర్రీ డ్యుబ్రో స్పందిస్తూ…. ప్రస్తుతం ఇది హాలీవుడ్ సెలబ్రెటీలకు క్రిస్మస్ వెకేషన్ లాంటిదన్నారు. అమెరికాలో ప్రత్యేకించి బెవెర్లీ హిల్స్ నుంచి సెలబ్రెటీలు.. హైప్రొఫైల్స్ వారి నుంచి ప్లాస్టిక్ సర్జరీ కోసం ఫోన్ కాల్స్ వస్తున్నాయని తెలిపారు. కారణంగా అక్కడ కరోనా వల్ల మొత్తం బంద్ పాటిస్తున్నారు. దీంతో సెలబ్రిటీలు ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకుంటున్నారట. హాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రమేకాదు… మన ఇండియాకి చెందిన తారలు కూడా ప్లాస్టిక్ సర్జరీలు చేయించు కునేందుకు సిద్ధమవుతున్నారట. అందులో బాలీవుడ్.. టాలీవుడ్ తారలు కూడా ఉండటం విశేషం. అయితే ఓ వైపు జనం.. ప్రపంచం మొత్తం కరోనా ఆందోళనలో ఉంటే వీరికి అందం కావాల్సి వచ్చిందా అంటూ కామెంట్స్ చేసే వారు లేకపోలేదు. ఏం చేస్తాం..ఎవరి అభిప్రాయాలు వారివి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-