జిమ్ డ్రెస్సులకు బ్రాండ్ అంబాసిడర్లా?

0

బాలీవుడ్ లో ఈ కొత్త ట్రెండ్ అంతకంతకు ఊపేస్తోంది. అందాల కథానాయికలు ఇటీవల పబ్లిసిటీ కోసం వెంపర్లాడుతున్న తీరు చర్చనీయాంశమైంది. సీనియర్లు జూనియర్లు అనే తేడా లేకుండా ముంబై భామల పాకులాట చూస్తుంటే ఆశ్చర్యపరుస్తోంది. సోషల్ మీడియాతో పాటు రెగ్యులర్ మీడియా ఈ భామల పాపులారిటీని అమాంతం పెంచేస్తున్నాయి. అయితే అనూహ్యంగా పెరిగిన ఠఫ్ కాంపిటీషన్ లో తమను తాము డిఫరెంట్ గా యూనిక్ గా ప్రెజెంట్ చేసుకునేందుకు ప్రయత్నమా ఇది..? అసలేం జరుగుతోంది అన్నది చూస్తే…

ముఖ్యంగా డెబ్యూ కథానాయికలు పోటీలో యూనిక్ నెస్ కోసం ట్రై చేస్తున్నారని అర్థమవుతోంది. అందుకే ఈ భామలు నిరంతరం లుక్ పరంగా చాలా జాగ్రత్తలే తీసుకుంటున్నారు. రెగ్యులర్ గా స్పోర్ట్స్ లుక్ లో కనిపిస్తున్నారు. టైట్ ఫిట్ డ్రెస్సుల్లో పబ్లిక్ అప్పియరెన్స్ ఇస్తూ హాట్ టాపిక్ గా కనిపిస్తున్నారు. జాన్వీ కపూర్- తారా సుతారియా- సారా అలీఖాన్ లాంటి నవతరం నాయికలు లేటెస్ట్ ఫ్యాషన్స్ ని అనుకరిస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ భామలంతా ప్రఖ్యాత స్పోర్ట్స్ బ్రాండ్స్ ని ఎంచుకుని వాటికి ప్రచారం కల్పిస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రతిసారీ ఈ భామల పబ్లిక్ అప్పియరెన్స్ వెనక మంత్రాంగం ఏమిటి? అన్నది చూస్తే ఒక్కోసారి షాక్ తినాల్సి ఉంటుంది. పబ్లిక్ లో అలా కాలు పెడితే చాలు ఏదైనా స్పోర్ట్స్ బ్రాండ్ దుస్తుల్ని ధరించి కనిపిస్తున్నారు. జనాల కళ్లన్నీ తమపైనే ఉంటాయి కాబట్టి ఈ భామలతో ప్రచారం చేయించుకునేందుకు స్పోర్ట్స్ కంపెనీలు పోటీపడుతున్నాయి.

ఈ కల్చర్ తొలుత లోఫర్ బ్యూటీ దిశాపటానీతోనే స్పీడందుకుందని చెప్పాలి. 2018 దీపావళికి దివా పటానీ ప్రఖ్యాత కెల్విన్ క్లెయిన్ లోదుస్తుల్ని ధరించి సంచలనం సృష్టించింది. దీపావళి లక్ష్మీ దేవి ఇంత హాట్ గా ఉందేమిటి! అంటూ సీకే బ్రాండ్ గురించి యూత్ అదే పనిగా మాట్లాడుకున్నారు. సీకే ఎత్తుగడ అద్భుతంగా ఫలించింది. ఆ తర్వాత ప్రగ్యా జైశ్వాల్ – మలైకా అరోరాఖాన్- శ్రద్ధా కపూర్ .. ఒకరేమిటి వీలున్నంత మంది స్టార్లు ఈ తరహాలో స్పోర్ట్స్ డిజైన్లతో దేహాన్ని అంటుకుపోతున్న దుస్తుల్లో సర్ ప్రైజ్ ట్రీటిచ్చారు.

ఇటీవల కొంతకాలంగా జాన్వీ ఏ రేంజులో రెచ్చిపోతోందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. రెగ్యులర్ గా జిమ్ కి వెళ్లినా .. పబ్లిక్ లోకి వెళ్లినా ఈ అమ్మడు టైట్ ఫిట్ డ్రెస్సులతోనే ప్రత్యక్షమవుతుండడంతో జనం ఎగబడుతున్నారు. ఇక అదే బాటలో సైఫ్ అలీఖాన్ డాటర్ సారా అలీఖాన్ సైతం జిమ్ముకు వెళ్లేప్పుడు ప్రత్యేకమైన స్పోర్ట్స్ డ్రెస్సులతో వేడెక్కిస్తోంది. తాజాగా ఈ భామ ప్రఖ్యాత ప్యూమా స్పోర్ట్స్ వేర్ ధరించి జిమ్ కి వెళుతూ కనిపించింది. దీంతో ప్యూమాకి ప్రచారం చేస్తోందా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇక సారాతో పాటు జిమ్ ట్రైనర్ నమ్రత పురోహిత్ రీబాక్ డిజైనర్ టాప్ ని ధరించింది. తనవంతు రీబాక్ కి ప్రచారం చేస్తోందేమో! అంటూ యూత్ గుసగుస వేడెక్కించింది. దిశా పటానీ సీకే బ్రాండ్ కి ప్రచారం చేస్తున్నట్టే వీళ్లు కూడా భారీగా కార్పొరెట్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారా? అన్న సందేహం కలుగుతోంది. బహుశా జాన్వీ కపూర్.. మలైకా టైట్ డ్రెస్సుల వెనక మహిమ ఇలాంటి ప్రచారమేనా? అసలు ఈ కొత్త ఎత్తుగడ వెనక ఏ మేరకు కాంట్రాక్టులు కుదుర్చుకున్నారు? ఏ మేరకు డబ్బు చేతులు మారుతోంది? అంటూ ఆరాలు వేడెక్కిస్తున్నాయ్.
Please Read Disclaimer