హంస రాణులు క్రిస్మస్ ట్రీట్ అదిరెనే

0

వైట్ అండ్ వైట్ లో తళాంగుతళుకుల ప్రదర్శనతో క్రిస్మస్ హీటెక్కిపోతోంది. నేడు క్రిస్మస్ ని పురస్కరించుకుని బాలీవుడ్ సెలబ్రిటీలంతా పార్టీలతో ఫుల్ స్వింగులో ఉన్నారు. ఇరుగు పొరుగు వారిని ఆహ్వానించడమే గాక.. ఇంటిల్లి పాదీ ఓచోట చేరి శాంటా ట్రీట్ ని ఆస్వాధిస్తున్నారు.

నేడు క్రిస్మస్ ని పురస్కరించుకుని బెబో కరీనాకపూర్ – సైఫ్ అలీఖాన్ జోడీ ముంబైలోని తమ స్వగృహంలో అదిరిపోయే పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి పలువురు బాలీవుడ్ కపుల్స్ ఎటెండయ్యారు. ఇందులో అర్జున్ కపూర్ – మలైకా అరోరాఖాన్ సహా కొందరు స్టార్లు ఉన్నారు. అయితే ఎంతమంది స్టార్లు ఎటెండయినా పార్టీలో కళ్లన్నీ ఒక బ్యూటీపైనే.

అసలు ఈ పార్టీ సంగతేమో కానీ.. సైఫ్ డాటర్ సారా అలీఖాన్ అక్కడ అదిరిపోయే లుక్ తో దిగిపోవడంతో పార్టీ క్రౌడ్స్ కళ్లన్నీ తనపైనే వాలిపోయాయి. సారా స్టన్నింగ్ వైట్ అండ్ వైట్ ఔట్ ఫిట్ తో కళ్లు తిప్పుకోనివ్వని ట్రీటిచ్చింది. వైట్ లో అందాలు కనువిందు చేసేందుకు పోటీపడ్డాయనే చెప్పాలి. ఇక వేరొక ఈవెంట్లో జాన్వీ కపూర్ సైతం ఫుల్ వైట్ అండ్ వైట్ లో కనువిందు చేసిన స్టిల్స్ ఇప్పటికే అంతర్జాలాన్ని హీటెక్కిస్తున్నాయి. అటు జాన్వీ థై స్లిట్ డ్రెస్ మత్తెక్కిస్తుంటే.. సేమ్ టైమ్ సారా అలీఖాన్ సైతం థై అందాల్ని ఎలివేట్ చేస్తూ స్పెషల్ ప్రిపరేషన్ తో రావడంతో ఇక యూత్ కి ఒకటే కన్నుల పండగ. ఆ ఇద్దరితో పోటీపడుతూ మరో నటవారసురాలు అనన్య పాండే సైతం బికినీ బీచ్ లో వైట్ అండ్ వైట్ లుక్ లో దిగిపోయిన ఫోటో ఇన్ స్టాలో వేడెక్కిస్తోంది. క్రిస్మస్ ట్రీటా మజాకానా!!
Please Read Disclaimer