గొల్లపూడికి టాలీవుడ్ స్టార్స్ నివాళ్లు

0

నటుడిగా.. రచయితగా ఎన్నో సక్సెస్ లు దక్కించుకుని మల్టీ ట్యాలెంటెడ్ అనిపించుకున్న గొల్లపూడి మారుతి రావు నేడు మృతి చెందిన విషయం తెలిసింది. ఆయన హఠత్మరణం టాలీవుడ్ సినీ ప్రముఖులకు తీవ్ర దిగ్బ్రాంతిని కలిగించాయి. పలువురు స్టార్స్ సోషల్ మీడియా ద్వారా గొల్లపూడికి నివాళ్లు అర్పించారు. గొల్లపూడి లేని లోటు తీర్చలేనిదంటూ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు.

మహేష్ :

గొల్లపూడి మారుతిరావు గారు హఠాత్తుగా మరణించడం నాకు షాకింగ్ గా ఉంది. తెలుగు సినిమా పరిశ్రమకు ఆయన చేసిన సేవ మరువలేనిది. ఇండస్ట్రీ ఒక మేధావిని కోల్పోయింది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలుగాలంటూ ట్వీట్ చేశాడు.

మంచు మనోజ్ :

గొల్లపూడి గారి మరణ వార్త విని షాక్ అయ్యాను. మీ రచనలు అద్బుతం.. మీ రచనలు అందరికి ఆదర్శం మరియు రిఫరెన్స్. తెలుగు సినిమా పరిశ్రమకు మీరు చేసిన సేవ మాటల్లో చెప్పలేం. మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. మీ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానంటూ ట్వీట్ చేశాడు.

గోపీచంద్ :

గొల్లపూడి మారుతి గారి మరణం తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. సినిమాకు మీరు చేసిన సేవ మరువలేనిది. మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం.

నితిన్ :

సినిమా పరిశ్రమకు మీరు చేసిన సేవ మరువలేనిది. మీ లోటును ఎవరు భర్తి చేయలేరు. మీ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశాడు.

సుధీర్ బాబు :

గొల్లపూడి గారి మరణం నాకు చాలా బాధను కలిగించింది. ఆయన నటుడిగా ఎలా ఉండాలి అనేందుకు ఒక ఉదాహరణ. వైవిధ్య భరిత నటనకు ఆయన కేరాఫ్ గా నిలిచాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్ధిస్తున్నాను అంటూ ట్వీట్ చేశాడు.

వరుణ్ తేజ్ :

గొల్లపూడి వంటి గొప్ప వ్యక్తితో నటించే అవకాశం నాకు దక్కింది. ఆయన ఒక అద్బుతమైన వ్యక్తి. మీరు సినిమాకు చేసిన సేవకు కృతజ్ఞతలు. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశాడు.