కరోనాని క్రేజ్ కోసం వాడుకుంటున్న సెలెబ్రెటీలు…!

0

ప్రపంచ దేశాలన్నిటినీ గడగడలాడిస్తున్న మహమ్మారి కరోనాపై అన్ని దేశాలు కూడా గట్టిగా యుద్ధాన్ని ప్రకటించాయి. ముందుగా ప్రజలను తమ ఇళ్లకు పరిమితం చేసేలా లాకౌట్ ప్రకటించిన పలు దేశాలు – ఎవ్వరూ కూడా అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని – అలానే ఎవరికి వారు తప్పనిసరిగా సోషల్ డిస్టెన్స్ పాటిస్తేనే త్వరితగతిన ఈ వ్యాధిని అరికట్టగలం అని నిర్ణయించాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో 21 రోజులు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా దెబ్బకు సినిమా ఇండస్ట్రీ కూడా లాక్ డౌన్లోకి వెళ్లింది. టాలీవుడ్ – బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలు షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చి అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు.

సెలబ్రిటీలు తమకు లభించిన సమాయాన్ని గృహ నిర్బంధంలో ఎంజాయ్ చేస్తున్నారు. షూటింగులు లేక ఖాళీగా ఉండటంతో కావాల్సినంత టైం దొరికి సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెడుతూ హోరెత్తిస్తున్నారు. ఇంట్లోనే యోగా – వర్క్ ఔట్స్ – కుకింగ్ అంటూ రకరకాల వీడియోస్ పోస్ట్ చేస్తూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని అందరితో పంచుకుంటున్నారు. హీరోయిన్లయితే బాడీ ఫిట్ నెస్ కోసం యోగా – జిమ్ అంటూ ఒంటికి పని చెప్తున్నారు.

మరికొందరు పనిమనుషులు కూడా రాకపోవడంతో తమ పనులు తామే చేసుకోవాలి అంటూ చీపురు పట్టి ఇల్లు ఊడుస్తూ – అంట్లు తోముతూ – బట్టలు ఉతుకుతూ వీడియోస్ పెడుతున్నారు. కొంతమంది హాట్ హాట్ ఫొటోలను అప్లోడ్ చేస్తూ హీట్ పెంచుతున్నారు. ఎలాగూ షూటింగ్స్ లేకపోవడంతో ఈ ఖాళీ టైం ని క్రేజ్ పెంచుకోవడం కోసం వాడుకుంటున్నారు మన సెలెబ్రెటీలు. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు – చిన్న హీరోయిన్ల నుండి పెద్ద హీరోయిన్ల వరకు..ఒకరేమిటి అందరూ తమ ఫోటోలను వీడియోలను అప్ లోడ్ చేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఎవరితో కలవొద్దు – గుంపులుగా ఉండొద్దు – బయటకి రావద్దు అని రూల్స్ ఉన్నాయి కానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దు ట్వీట్ చేయొద్దు అని రూల్స్ లేవుగా. అందుకే హీరోయిన్లు కరోనా డేస్ ని ఇలా వాడేస్తూ వారి క్రేజ్ పోకుండా జాగ్రత్త పడుతున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-