సాహోకు సెన్సార్ లొల్లి?

0

అభిమానులే కాదు యావత్ సినిమా ప్రేమికులు ఎదురు చూస్తున్న సాహో సెన్సార్ పూర్తి చేసుకున్నట్టుగా తాజా అప్ డేట్. నిర్మాతలు ఇంకా ధ్రువీకరించలేదు. కానీ కంటెంట్ దృష్ట్యా ఎటువంటి కట్స్ లేకుండా అయితే ఏ మార్క్ లేదా కొన్ని చెప్పిన మార్పులు చేస్తే యు/ఎ ఇస్తామని అధికారులు చెప్పినట్టుగా వినికిడి. ఒకవేళ ఏ ఇస్తే చాలా ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా మల్టీ ప్లెక్సుల్లో 18 లోపు వయసు పిల్లలు సాహో చూసేందుకు అనుమతించరు. ఇది ఖచ్చితంగా వసూళ్ల మీద ప్రభావం చూపిస్తుంది. పైగా ఆయా యాజమాన్యాలకు కూడా లేనిపోని తలనెప్పి.

అలా కాకుండా యు/ఎ ఇస్తే ఎలాంటి సమస్యా ఉండదు. అందుకే కట్స్ మ్యూట్స్ లేకుండా యు బై ఎ వచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలిసింది. విడుదలకు కేవలం 9 రోజులు మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో ఇదో తీవ్రమైన అడ్డంకిగా ఉండకూడదనేది యువి ఆలోచన. దీనికి సంబంధించిన క్లియర్ అప్ డేట్ ఈ రోజు లేదా రేపు వచ్చే ఆవకాశం ఉంది. నిడివి ఇప్పటికే 2 గంటల 52 నిముషాలు అనే టాక్ ఉంది. ఒకవేళ ఫైనల్ కట్ లో ఏమైనా తగ్గించారేమో చూడాలి. ప్రస్తుతానికి అలాంటి సూచనలైతే కనిపించడం లేదు.

అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఆన్ లైన్ లో ఇంకా మొదలుపెట్టలేదు. శనివారం నుంచి ప్రారంభించేలా ఏర్పాట్లు పూర్తయ్యాయని ఇన్ సైడ్ టాక్. క్రాష్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి బుక్ మై షో లాంటి యాప్స్ అందుకు అనుగుణంగా అప్ గ్రేడ్ చేసుకుంటున్నట్టుగా తెలిసింది. మొత్తానికి సాహో ఫీవర్ వైరల్ లాగా రోజురోజుకి పెరిగిపోతోంది. బాహుబలి 2ని టార్గెట్ చేసిన సాహో ముందు కొండంత లక్ష్యం ఉంది. మంచులా కరిగిపోతున్న కాలంలో తొమ్మిది రోజులు పెద్ద లెక్క కాదు కానీ వేచి చూద్దాం.




Please Read Disclaimer