‘సాహో’ సెన్సార్.. కోరుకున్నట్లే జరిగింది

0

ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న ‘సాహో’ విడుదలకు మరో వారం రోజులు మాత్రమే సమయం ఉంది. దాదాపుగా 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రంను తెలుగుతో పాటు సౌత్ భాషలన్నింటిలో మరియు హిందీలో కూడా భారీ ఎత్తున విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. గత రెండు రోజులుగా ఈ చిత్రం సెన్సార్ గురించిన వార్తలు జోరుగా వస్తున్నాయి. సినిమాకు ‘ఎ’ సర్టిఫికెట్ రాకుండా ముందస్తుగానే కట్టింగ్ లను చిత్ర యూనిట్ సభ్యులు చేశారనే టాక్ కూడా వచ్చింది.

తాజాగా ‘సాహో’ కు సెన్సార్ కార్యక్రమాలు పూర్తయినట్లుగా యూనిట్ సభ్యుల నుండి అనధికారికంగా సమాచారం వస్తోంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రంకు అంతా కోరుకున్నట్లుగానే ‘యూ/ఎ’ దక్కింది. ఒకటి రెండు కట్స్.. ఒకటి రెండు చోట్ల బ్లర్ చెప్పిన సెన్సార్ బోర్డు యూ/ఎ ను ఇచ్చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ చిత్రం రన్ టైం విషయానికి వస్తే 2 గంటల 54 నిమిషాలంటూ వార్తలు వస్తున్నాయి. మొన్నటి వరకు రెండున్నర గంటలే సాహో ఉండబోతుందని వార్తలు వచ్చాయి. కాని ఆ వార్తలు కూడా నిజం కాదని 6 నిమిషాలు తక్కువ మూడు గంటల పాటు సాహో ఎంటర్ టైన్ చేసేందుకు రాబోతున్నట్లుగా తేలిపోయింది.

బాహుబలి వంటి పెద్ద హిట్ మూవీ తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా అవ్వడంతో దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున అంచనాలున్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రంను సుజీత్ దర్శకత్వంలో వంశీ మరియు ప్రమోద్ లు భారీ బడ్జెట్ తో నిర్మించారు. బాలీవుడ్ తారా తోరణంతో ఈ చిత్రంను నింపేసిన కారణంగా అక్కడ మరింత ఆసక్తి కలిగించారు. ప్రమోషన్స్ తో సినిమా స్థాయిని అమాంతం పెంచేశారు. హాలీవుడ్ స్థాయి యాక్షన్ సీన్స్ ఈ చిత్రంలో ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుందంటూ యూనిట్ సభ్యులు చాలా నమ్మకంగా చెబుతున్నారు. దాదాపు రెండేళ్ల పాటు చిత్రీకరణ జరుపుకు ఈ చిత్రం ఎదురు చూపులకు తెర దించుతూ ఆగస్టు 30వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Please Read Disclaimer