స్టార్ డాటర్ ఇస్పీడ్ కి సెన్సార్ బెంబేలు

0

బాలీవుడ్ సినిమాలకు సెన్సార్ గడపపై ఉండే లిబర్టీ గురించి చెప్పాల్సిన పనే లేదు. అక్కడ సెన్సార్ పరంగా అంతగా ఇబ్బందేమీ ఉండదు. ఘాటైన రొమాంటిక్ సన్నివేశాల్లో ఎంతగా హద్దు మీరినా.. అదంతా సీన్ డిమాండ్ వల్లనే.. ఇది సహజమేనని సెన్సార్ సైతం లైట్ తీసుకునే వీలుంటుంది. అదీ రొమాంటిక్ లవ్ స్టోరీస్ లో హద్దులు దాటిన పెదవి ముద్దులు..బెడ్ రూమ్ సన్నివేశాలు ఎంత రియలిస్టిక్ గా ఉన్నా! సెన్సార్ వాటి జోలికి తొందరగా వెళ్లదు. డైలాగ్స్ కి బీప్ చేయడం..మ్యూట్ చేయడం.. సీన్స్ బ్లర్ చేయడం వంటిచి చాలా రేర్ గా మాత్రమే జరుగుతుంటుంది. ఇలాంటి మసాలా సన్నివేశాలు అన్నిచోట్లా కామన్ అయిపోవడంతో సెన్సార్ కూడా అంతగా పట్టించుకోనట్టే వ్యవరిస్తుంది.

అయితే సైఫ్ డాటర్ సారా అలీఖాన్యం..గ్ హీరో కార్తీక్ ఆర్యన్ లు సెన్సార్ కే గుబులు పుట్టించేలా తెరపై చెలరేగిపోయారుట. ఆ ఇద్దరు జంటగా లవ్ ఆజ్ కల్ -2లో నటించిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా సెన్సార్ ముందుకు వెళ్లిన ఈ సినిమాలో ఆన్ స్క్రీన్ పై విచ్చలవిడిగా రొమాంటిక్ సన్నివేశాల్లో రెచ్చిపోయారుట. అంతే గాకుండా హీరో- హీరోయిన్ ఇద్దరు డబుల్ మీనింగ్ డైలాగులు.. అభ్యంతరకర సన్నివేశాలు శృతి మించాట.

దీంతో సెన్సార్ కత్తెరకు ఎక్కువగానే పని చెప్పారుట. కొన్ని సన్నివేశాలు తొలగించాలని..మరికొన్నింటిని మ్యూట్ చేయాలని సూచించిందిట. అలాగే సారా-కార్తీక్ మధ్య ముద్దు సన్నివేశాలు వచ్చినప్పుడు వాటిని బ్లర్ గా చూపించాలని ఆదేశించారుట. దీంతో యూనిట్ పెద్ద షాక్ తగిలింది. సినిమాలో పండే సన్నివేశాల్నే తొలగించమనడంతో.. ఫీల్ మిస్ అవుతుందనే సందేహ పడుతున్నారుట. కారణాలు ఏవైనా సెన్సార్ వాళ్లు చెప్పారు కాబట్టి పాటించాల్సిందే. సెన్సార్ నుంచి ఏ సర్టిఫికెట్ట్ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని చెబుతున్నారు. ఈ చిత్రానికి ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-