నిర్మాతలకు భారంగా మారబోతున్న చైతూ

0

అక్కినేని నాగచైతన్య కెరీర్ ఆరంభం నుండి నిలకడగా ముందుకు సాగుతున్నాడు. సక్సెస్ ఫ్లాప్స్ తో చైతూ కెరీర్ లో ముందుకు సాగుతున్నాడు. సక్సెస్ వచ్చిన వెంటనే ఫ్లాప్ పడుతూనే ఉన్న కారణంగా చైతూ పారితోషికం పెంచలేక పోతున్నారు. ఇతర యంగ్ హీరోలతో పోల్చితే చాలా బెటర్ గానే ఉన్న చైతూ ఇంకా తన పారితోషికంను పెంచే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. మజిలీ చిత్రంతో మంచి సక్సెస్ ను దక్కించుకున్న చైతూ ప్రస్తుతం వెంకీ మామ చిత్రంతో రాబోతున్నాడు.

వెంకీ మామ చిత్రం మరి కొన్ని వారాల్లో విడుదల కాబోతుండగా.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేస్తున్న సినిమా కూడా మరీ ఎక్కువ లేట్ కాకుండా విడుదల కాబోతుంది. ఈ రెండు సినిమాలపై కూడా చైతూ చాలా నమ్మకంగా ఉన్నాడు. ఖచ్చితంగా ఈ రెండు సక్సెస్ లు అయితే హ్యాట్రిక్ కొట్టానంటూ చైతూ పారితోషికం పెంచే ఉద్దేశ్యంలో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. అందుకే కొత్త ప్రాజెక్ట్ లు ఏవీ ఓకే చేయడం లేదని.. నిర్మాతలను హోల్డ్ లో ఉంచినట్లుగా తెలుస్తోంది.

ఇప్పటికే చైతూ ఇద్దరు ముగ్గురు నిర్మాతలకు డేట్లు అయితే ఇచ్చాడు. కాని ఆ నిర్మాతలతో పారితోషిక ఒప్పందం చేసుకోలేదని.. ఆ సినిమాల విడుదల తర్వాత పారితోషికంను కోటి లేదా కోటిన్నర వరకు పెంచాలని చైతూ భావిస్తున్నాడట. ఇప్పటి వరకు మీడియం పారితోషికం తీసుకున్న చైతూ పారితోషికం పెంచితే నిర్మాతలకు భారం అవుతాడేమో అంటూ ఇండస్ట్రీలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. చైతూ ఈ రెండు సినిమాల సక్సెస్ తో మార్కెట్ కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది. కనుక చైతూతో సినిమా నిర్మించే నిర్మాతలకు వచ్చే నష్టం ఏమీ ఉండదని కొందరు విశ్లేషిస్తున్నారు.
Please Read Disclaimer