మెగా 152లో తెలుగమ్మాయికి ఛాన్స్?

0

చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లను నమోదు చేసింది. చిరంజీవి మరియు చరణ్ లు పూర్తి సంతృప్తికరంగా ఉన్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఇక ప్రస్తుతం చిరంజీవి తన 152వ చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేసేందుకు సిద్దం అవుతున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఈ చిత్రాన్ని కూడా రామ్ చరణ్ నిర్మించబోతున్నాడు. వరుస విజయాలను సాధిస్తూ ఇప్పటి వరకు పరాజయం ఎరుగని కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న నేపథ్యంలో ఇప్పటి నుండే అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.

ఇక ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు త్రిష తో పాటు ఇంకా చాలా మంది హీరోయిన్స్ ను పరిశీలించారు.. చర్చలు జరిపారని వార్తలు వస్తున్నాయి. త్రిష వద్దకు వచ్చి చర్చలు ఆగాయని మెగా 152లో త్రిష కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో ఈ చిత్రంలో మరో హీరోయిన్ పాత్ర కోసం తెలుగమ్మాయి ఈషా రెబ్బాను ఎంపిక చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈమద్య కాలంలో ఈషాకు మంచి సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. నటిగా నిరూపించుకోవడంతో పాటు గ్లామర్ పరంగా కూడా ఉత్తరాది ముద్దుగుమ్మలకు తగ్గకుండా అందాల ఆరబోత చేస్తోంది.

సినిమాలో సెకండ్ హీరోయిన్ అని కాదు కాని ఒక ముఖ్యమైన లేడీ పాత్రకు ఈషాను తీసుకునే ఆలోచనలో మెగా కాంపౌడ్ ఉందని కొరటాల శివ కూడా ఆమెకు ఓకే చెప్పినట్లుగా సమాచారం అందుతోంది. సినీ వర్గాల వారి ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం ఇప్పటికే ఆమెతో చిత్ర యూనిట్ సభ్యులు కొందరు చర్చలు జరిపినట్లుగా కూడా తెలుస్తోంది. మెయిన్ హీరోయిన్ విషయంలో ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత సెకండ్ హీరోయిన్ పాత్ర ఈషా చేయబోతుందని చెప్పే అవకాశం ఉంది.

ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించి వచ్చే ఏడాది ఉగాదికి మెగా 152 చిత్రాన్ని విడుదల చేయబోతున్నారట. ఇప్పటికే ఈ సినిమా గురించి చాలా పుకార్లు మీడియాలో వచ్చాయి. వాటికే ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పుడు ఈషా ఈ చిత్రంలో అంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఈ విషయమై ఈషా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
Please Read Disclaimer