జ్యోతిలక్ష్మి అయినా టెన్షన్ పడాలి

0

ఎయిటీస్ లో ఐటెమ్ నంబర్ అంటే ప్రత్యేకించి ఆ కేటగిరీలో భామను ఎంపిక చేసుకునేవారు. అప్పట్లో జ్యోతిలక్ష్మి .. జయమాలి.. సిల్క్ స్మిత .. విజయలక్ష్మి అంటూ ఎవరో కొందరే ఉండేవారు. కానీ కాలం మారింది. కథానాయికలే ఐటెమ్ భామలుగా మారిపోయి కుర్రకారును కవ్విస్తున్నారు. ఇక బాలీవుడ్ ఈ కల్చర్ ని ఎప్పుడో మొదలు పెట్టింది. బెబో కరీనా మొదలు సన్నీలియోన్ వరకూ ఐటెమ్ నంబర్లలో నర్తించిన వారే.

ప్రస్తుతం సీనియర్ల బాటనే అనుసరిస్తోంది నేటితరం. ఇక సినిమాలో ప్రధాన నాయికగా నటించే భామలపైనే ఐటెమ్ నంబర్ తరహా వేడెక్కించే గీతాలను చిత్రీకరిస్తున్నారు. ఇటీవల ఈ తరహా గీతాలు విశేష ఆదరణ పొందాయి. తాజాగా కిలాడీ అక్షయ్ కుమార్- దిల్జీత్ దోసాంజి కథానాయకులుగా కరీనా కపూర్- కియరా అద్వాణీ కథానాయికలుగా గుడ్ న్యూజ్ అనే చిత్రం సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. ఐవీఎఫ్ -సంతాన లేమి కాన్సెప్టుతో తెరకెక్కిస్తున్న ఈ సినిమా టీజర్ ఇటీవలే రిలీజై ఆకట్టుకుంది.

తాజాగా ఈ మూవీ నుంచి కియరా లీక్డ్ ఫోటో అంతర్జాలంలో వేడెక్కిస్తోంది. బంగారు రంగు ఛమ్కీల డ్రెస్ లో కియరా ఎక్స్ ప్రెషన్ బోయ్స్ ని కిల్ చేస్తోంది. ఎక్స్ ప్రెషన్ లో జ్యోతిలక్ష్మినే మించిపోయిందని ఈ ఫోటో చెబుతోంది. కియరా ఆహార్యానికి తగ్గట్టే భారీతనం నిండిన జిగ్ జాడ్ డిజైనర్ డ్రెస్ కియరా గ్లామర్ ని పదింతలు ఎలివేట్ చేసింది. ఈ రేంజు కిల్లింగ్ లుక్స్ తో కియరా ట్రీటిస్తుండడం చూస్తుంటే గుడ్ న్యూజ్ చిత్రంలో ఇలాంటి గ్లింప్స్ కి కొదవేమీ ఉండదని అర్థమవుతోంది. డిసెంబర్ 27న ఈ చిత్రం రిలీజ్ కానుంది.
Please Read Disclaimer