తన పై ట్రోల్ కు గట్టి కౌంటర్ ఇచ్చింది

0

యూట్యూబ్ లో ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ తో ఛాందిని చౌదరి మెప్పించింది. యూట్యూబ్ లోనే కాకుండా సినిమాల్లో కూడా ఈమె ఈమద్య కాలంలో మెల్లగా రాణిస్తోంది. సినీ కెరీర్ ఆరంభంలో ఈమె హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో ఇతర పాత్రల్లో కనిపించిన ఛాందిని చౌదరి ఇప్పుడు మెయిన్ హీరోయిన్ గా నటించింది. ఈమె హీరోయిన్ గా నటించిన ‘కలర్ ఫొటో విడుదలకు సిద్దం గా ఉంది. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో తాను ప్రస్తుతం ఉన్న యంగ్ స్టార్ హీరోలందరితో కలిసి నటించాలని ఆశిస్తున్నాను. అందుకోసం తీవ్రంగా ప్రయత్నిస్తాను కష్టపడతాను అంటూ చెప్పుకొచ్చింది. ఛాందిని చౌదరి ఆ వ్యాఖ్యలకు ట్విట్టర్ లో నాకు సుందర్ పిచ్చైతో వర్క్ చేయాలని ఉంది సాధ్యం అవుతుందా అంటూ ఛాందిని నీకు అంత సీన్ లేదు అన్నట్లుగా పచ్చగడ్డి అనే పేరుతో ఉన్న ట్విట్టర్ హ్యాండిల్ కామెంట్ చేసింది. ఆ కామెంట్ కు ఛాందిని సీరియస్ గా కౌంటర్ ఇచ్చింది.

ఛాందిని ట్విట్టర్ లో… ప్రతి ఒక్కటి కూడా సాధ్యమే.. అయితే అది ఎవరైనా సాధించినప్పుడు మాత్రమే. సాధించకుండా అలాగే ఉంటే ఎప్పటికి అది అసాధ్యంగానే ఉంటుంది. నేను నా కలలను నెరవేర్చుకునేందుకు కష్టపడుతూ ముందుకు సాగుతున్నాను. ఏదో ఒక రోజు నేను అనుకున్న కలలు అన్ని కూడా సాధ్యం అవుతాయి. నీవు కూడా ఇంటర్నెట్ ముందు కూర్చుని ఇతరులను విమర్శించడం మానేసి కష్టపడితే ఖచ్చితంగా నీవు కూడా ఏదో ఒక రోజు నీవు అనుకున్నది సాధ్యం అవుతుంది. నీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను అంటూ కౌంటర్ ఇచ్చినట్లే ఇచ్చి అవతలి వారికి చాలా గట్టిగా తలిగేలా కామెంట్ కు సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం రెండు మూడు సినిమాలతో పాటు వెబ్ సిరీస్ ల్లో కూడా ఛాందిని నటిస్తోంది. ముందు ముందు ఆమె కోరుకున్నట్లుగా యంగ్ స్టార్ హీరోలతో కూడా నటించే అవకాశాలు దక్కించుకుంటుందో చూడాలి.