ఆర్ ఆర్ ఆర్ పోటీకి సై అన్న చంద్రముఖి 2

0

వచ్చే ఏడాది జూలై 30 రిలీజ్ డేట్ ఏడాది ముందే బుక్ చేసుకున్న టాలీవుడ్ క్రేజీ మల్టీ స్టారర్ ఆర్ ఆర్ ఆర్ కు వెరవకుండా బాలీవుడ్ నిర్మాతలు ఒక్కొక్కరుగా తన సినిమాలను అదే డేట్ కి లేదా ఒక రోజు ఆలస్యంగా విడుదల చేసుకునేందుకు ప్లానింగ్ చేసుకుంటున్నారు. అక్షయ్ కుమార్ హీరోగా రోహిత్ శెట్టి రూపొందిస్తున్న కాప్ స్టోరీ ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. దీనికి జులై 30నే ఫిక్స్ చేశారు. అదే రోజు సల్మాన్ ఖాన్ దబాంగ్ 3 లేదా ఇన్షాఅల్లా రావొచ్చని ముంబై రిపోర్ట్స్ ఉన్నాయి.

ఇది చాలదు అన్నట్టు రజనీకాంత్ చంద్రముఖి రీమేక్ గా గతంలో వచ్చిన భూల్ భులయ్యా కు కొనసాగింపుగా తీసిన పార్ట్ 2 కూడా జులై 31న రాబోతున్నట్టు హీరో కార్తీక ఆర్యన్ తన ట్విట్టర్ ద్వారా అఫీషియల్ గా ప్రకటించాడు. సో ఆర్ ఆర్ ఆర్ కు నేషనల్ మార్కెట్ లో హిందీ సినిమాలతో భారీ పోటీ తప్పేలా లేదు. షూటింగ్ విషయంలో ఎప్పటికప్పుడు బ్రేకులు పడుతున్నా రాజమౌళి మాత్రం డేట్ విషయంలో ఎలాంటి మార్పు చేయడం లేదు. ఖచ్చితంగా వచ్చే తీరతామన్న నమ్మకంతో ముందుకు వెళ్తున్నాడు.

అక్కడ చూస్తేనేమో ఒకరిని మించి మరొకరు అదే తేదీ కోసం పోటీ పడుతున్నారు. ఈ లెక్కన నార్త్ లో ఆర్ ఆర్ ఆర్ కొంత టఫ్ కాంపిటీషన్ పేస్ చేయాల్సి ఉంటుంది. ఇదే పరిస్థితి ఆగస్ట్ 15 అనుకున్నప్పుడు సాహోకు వచ్చింది. కానీ అనూహ్యంగా రెండు వారాలు వాయిదా పడటంతో మిషన్ మంగళ్ – బాట్లా హౌస్ పండగ చేసుకున్నాయి. మరి ఆర్ ఆర్ ఆర్ వచ్చే టైంకి ఈ ఈక్వేషన్లు ఎలా మారతాయో వేచి చూడాలి
Please Read Disclaimer