హ్యాట్రిక్ కోసం స్టైల్ మార్చుతున్నాడా?

0

బాలకృష్ణతో ఇప్పటికే సింహా మరియు లెజెండ్ చిత్రాలను తెరకెక్కి సక్సెస్ లు దక్కించుకున్న దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ ప్రస్తుతం బాలయ్యతో సినిమాకు రెడీ అవుతున్నాడు. మామూలుగా అయితే వీరిద్దరి కాంబోకు భారీ క్రేజ్ ఉండేది. కాని బోయపాటి గత చిత్రం వినయ విధేయ రామ దారుణమైన డిజాస్టర్ ను చవిచూసింది. దాంతో బోయపాటి కెరీర్ ఖతమే అనుకున్నారు. కాని బాలయ్య చాలా నమ్మకం ఉంచి బోయపాటికి ఛాన్స్ ఇచ్చాడు.

బాలయ్య పెట్టుకున్న నమ్మకంను నిలబెట్టుకుని హ్యాట్రిక్ విజయాన్ని సొంతం దక్కించుకోవాలనే పట్టుదలతో బోయపాటి ఉన్నట్లుగా సినీ వర్గాల వారు అంటున్నారు. అందుకోసం తన పద్దతిని చాలా వరకు మార్చుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ప్రేక్షకుల అభిరుచి మేరకు సినిమాను ఎంటర్ టైన్ మెంట్ గా తెరకెక్కించడంతో పాటు యాక్షన్ సీన్స్ విషయంలో కూడా వినయ విధేయ రామ చిత్రంకు ఎదురైన చేదు అనుభవంను దృష్టిలో ఉంచుకున్నట్లుగా తెలుస్తోంది.

తన డైరెక్షన్ టీంలో ఉన్న పలువురు పాత వారిని తొలగించి కొత్త రక్తంను ఎక్కిస్తున్నాడట. ముఖ్యంగా మంచి రైటర్స్ ను బోయపాటి తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. డైలాగ్స్ ను ఎంటర్ టైన్ మెంట్ గా రాయడంతో పాటు స్క్రీన్ ప్లేను ఆసక్తికరంగా సాగేలా రాసే వారికి ప్రాముఖ్యత ఇస్తూ తన టీంలోకి తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక కామెడీ విషయంలో కూడా బోయపాటి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని.. జబర్దస్త్ కమెడియన్స్ ను ఈ సినిమా కోసం తీసుకుంటున్నట్లుగా కూడా వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. ఇంతగా బోయపాటి తన స్టైల్ ను తన టీంను మార్చినా కూడా ఫలితం ఏమేరకు దక్కేనో చూడాలి.
Please Read Disclaimer