ఓ బేబీ ఛాంగు భళా.. భలే ఉందిగా

0

నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంతా ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఓ బేబీ’ జూలై 5 న విడుదలకు సిద్ధం అవుతోంది. రిలీజ్ కు నెల కూడా సమయం లేకపోవడంతో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాను నుండి రెండు లిరికల్ సొంగ్స్ రిలీజ్ చేసిన ‘ఓ బేబీ’ టీమ్ తాజాగా ఛాంగు భళా అంటూ సాగే మూడవ లిరికల్ సింగిల్ ను విడుదల చేశారు.

ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతదర్శకుడు. ఈ పాటకు సాహిత్యం అందించిన వారు భాస్కరభట్ల. ఈ పాటను పాడిన సింగర్ నూతన మోహన్. ఎంతో ఆనందంతో ఎగిరి గంతులేస్తున్న సమంతా ఉత్సాహానికి తగ్గట్టు భాస్కరభట్ల ఫుల్ జోష్ ఉండే లిరిక్స్ అందించారు. “నేనే నేనా వేరే ఎవరోనా.. నేనే ఉన్నా సందేహం లోనా”.. అంటూ స్లోగా మొదలుపెట్టి “ఛాంగు భళా ఛాంగు భళా ఛాంగు భళా ఇలాగా నేను ఎలా మారిపోయా చెంగుమని భలేగా” అంటూ మంచి ఊపులోకి తీసుకెళ్ళారు. ఈ పాటకు ఎంతో స్వీట్ గా.. క్యాచీగా ఉండే ట్యూన్ ను మిక్కీ జె మేయర్ స్వరపరచగా సింగర్ నూతన డబల్ ఎనర్జీతో ఈ పాటను పాడారు.

ఓవరాల్ గా పాట చాలా బాగుంది. చార్ట్ బస్టర్ అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ పాటకు రఘు మాస్టర్ కొరియోగ్రఫీ అందించారట. ఈ పాటకు సామ్ స్క్రీన్ ప్రెజెన్స్ తోడైతే ఇక అభిమానులకు పండగే మరి. ‘మిస్ గ్రానీ’ అనే కొరియన్ సూపర్ హిట్ ఫిలిం కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కాన్సెప్ట్ కొత్తగా ఉంటుంది. దానికి తోడు ఇలాంటి జోష్ ఉన్న సాంగ్స్ తోడైతే సామ్ బాక్స్ ఆఫీస్ సందడి పీక్స్ లో ఉంటుందేమో!