సురేఖ వాణి పక్కన ఉన్నదీ ఆ వైనేనా?

0

నటి సురేఖా వాణి పేరు దాదాపుగా తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసే ఉంటుంది. ఒకవేళ పేరు తెలియకపోయినా జస్ట్ ఫోటో చూడగానే గుర్తుపడతారు. దాదాపు యాభైకి పైగా తెలుగు సినిమాల్లో ఎన్నో విభిన్న పాత్రల్లో నటించి సురేఖ ప్రేక్షకులను మెప్పించారు. ‘రెడీ’ సినిమాలో చిట్టి నాయుడు కు అమ్మగా సురేఖ నటన సూపర్ అనే చెప్పాలి. కొడుకుని అడ్డు పెట్టుకుని మామగారిని అడ్డమైన తిట్లు తిడుతూ నవ్వులు పూయించారు సురేఖ.

ఈ సినిమాలు.. అందులో పాత్రలు అన్నీ పక్కన పెడితే సురేఖ వాణి ఇన్స్టా లో యాక్టివ్ గా ఉంటారు. ఈమధ్య తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేశారు. ఎక్కడో ఒక అందమైన లొకేషన్ లో నీటిలో జలకాలాడుతూ కాస్త గ్లామరస్ ఫోటోను నెటిజన్లతో పంచుకున్నారు. ఫోటోలో ఆవిడ పక్కన ఓ వైన్ బాటిల్ కనిపించింది. ఇలాంటి అద్భుతమైన వస్తువులు కనిపించినప్పుడు డోనాల్డ్ ట్రంప్.. జిన్ పింగ్.. కిమ్ ఉన్ జోంగ్ లు ఊరుకుంటారేమో కానీ నెటిజన్లు మాత్రం ఊరుకోరు. ఆ బాటిల్ ఏంటి.. దాని వెనక కథ ఏంటి.. ఆ బ్రాండ్ ఏంటి.. అది మన ఊర్లో దొరుకుతుందా…ధర ఎంత ఇలాంటి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అలానే కనుకున్నారు.

ఫోటోను జూమ్ చెయ్యడంతో వైన్ బ్రాండ్ పేరు ‘మెర్లాట్'(MERLOT) అని.. రెడ్ వైన్ కేటగిరీలో ఇదో బ్రాండ్ అని బయటపడింది. క్వాలిటీ ని బట్టి ఈ వైన్ బాటిల్ 10 డాలర్స్ నుంచి 50 డాలర్స్ వరకూ ఉంటుందట. ఇది కాస్ట్లీ బ్రాండ్ ఏమీ కాదు. ఇండియాలో 750 ml బాటిల్ రూ.750 కు లభిస్తుందట. సరసమైన ధర కదా? ఈ వైన్ సేవిస్తే.. మంచి మేని రంగు వస్తుందని ఓ అభిప్రాయం ఉందట. దీంతో చాలామంది ఈ వైన్ ను ఇష్టపడతారట. మొత్తానికి నెటిజన్లు సురేఖ వాణి గారి పక్కన ఠీవిగా నిలుచున్న మద్యం సీసా చరిత్ర అంతా కనుకున్నారు!
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-