చరణ్ ను రా అనేంత ఫ్రెండ్ షిప్ ఉందా?

0

ఈ జెనరేషన్ హీరోలు చాలామంది క్లోజ్ ఫ్రెండ్స్. ఇక హీరోయిన్లు కూడా అంతే. సినిమాలలో నటించడమే కాదు.. రియల్ లైఫ్ లో కూడా ఫ్రెండ్షిప్ మెయింటెయిన్ చేస్తారు. మెగా పవర్ స్టార్ చరణ్ విషయానికి వస్తే ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు ఆయనకు క్లోజ్ ఫ్రెండ్స్. హీరోయిన్లు కూడా మంచి దోస్తులే. ఆ లిస్టులో తమన్నా కూడా ఒకరనే విషయం నిన్న ‘సైరా’ థ్యాంక్స్ మీట్ లో బయటపడింది.

తమన్నా ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ చరణ్ ప్రస్తావన వచ్చినప్పుడు చనువుగా ‘రా’ అని సంబోధించడం చాలామందిని సర్ ప్రైజ్ చేసింది. ‘సైరా’కు పనిచేయడంలో తన అనుభవాలు పంచుకుంటూ “చరణ్.. నువ్వు కో యాక్టర్ గా బెటర్ నా.. ప్రొడ్యూసర్ గా బెటర్ నా ఏం చెప్పాలి రా?” అనడంతో అందరూ నవ్వుల్లో మునిగిపోయారు. మెగాస్టార్ మాత్రం పెద్దంగా స్పందించాకుండా కామ్ గా ఉండిపోయారు.

ఇదే కార్యక్రమంలో చరణ్ స్పీచ్ ఇస్తున్న సమయంలో తమన్నా గురించి మాట్లాడబోయి పొరపాటుగా ‘మా నయనతార’ అన్నాడు. దీనికి తమన్నా నవ్వుల్లో మునిగిపోయింది. మిల్కీ ఆపకుండా నవ్వుతూనే ఉండడం చూసిన చరణ్ “నువ్వు నవ్వడం ఆపేస్తే.. మాట్లాడతా” అన్నాడు. ఇది చూసినవారికి ఇద్దరి మధ్యఫ్రెండ్షిప్ ఉన్న విషయం అర్థం అయిపోయింది. చరణ్ – తమన్నాలు హీరో హీరోయిన్లుగా ‘రచ్చ’ అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.Please Read Disclaimer