ఫుల్ గా ఎంజాయ్ చేసేద్దాం! ఆఫర్ ఎవరికి?

0

రాకరాక దక్కిన విజయమిది. దీంతో `ఇస్మార్ట్ శంకర్` సక్సెస్ సెలబ్రేషన్స్ లో నిర్మాతలు పూరి జగన్నాథ్ – ఛార్మి కౌర్ తలమునకలుగా ఉన్న సంగతి తెలిసిందే. ఇస్మార్ట్ సెలబ్రేషన్స్ పేరుతో ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఊరూ వాడా చుట్టేస్తూ బోలెడంత ప్రచారం చేస్తున్నారు. పూరి-ఛార్మిలతో పాటు హాట్ నిధి అగర్వాల్ అభిమానుల వద్దకు వెళ్లి ట్రీటిస్తున్నారు. మొత్తానికి ఇది కలెక్షన్లు పెంచేందుకు ఉపయోగపడుతోంది. అయితే ఈ టూర్ నుంచి ఇద్దరు కీలక స్టార్లు మిస్సవ్వడంతో అభిమానుల్లో దాని గురించిన ముచ్చటా సాగుతోంది.

ఇస్మార్ట్ శంకర్ గా నటించిన రామ్.. అతడితో పోటీపడుతూ మాసీగా హాట్ హాట్ గా అందాలు ఆరబోసిన నభా నటేష్ మిస్సవ్వడంపై ఫ్యాన్స్ చాలా నిరాశలో ఉన్నారు. ఆ క్రమంలోనే సోషల్ మీడియాలో ఛార్మి కౌర్- పూరి జగన్నాథ్ మధ్య జరిగిన సంభాషణ అభిమానుల్లో హీటెక్కించింది. పూరిని ట్యాగ్ చేస్తూ ఛార్మి చేసిన ట్వీట్.. దానికి పూరి రిప్లయ్ సోషల్ మీడియా సెన్సేషన్గా మారాయి. ఇంతకీ ఛార్మి చేసిన ట్వీట్లో ఏం ఉంది? అంటే.. “మరో రెండ్రోజుల్లో ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ (రామ్) హైదరాబాద్ లో అడుగు పెడుతున్నాడు. రా వచ్చి మాతో జాయిన్ అవ్వు.. పిచ్చెక్కేలా ఎంజయ్ చేద్దాం“ అంటూ చార్మి ట్వీట్ చేశారు.

దానికి ప్రతిగా స్పందించిన పూరి జగన్నాథ్.. “నీకు హగ్ ఇవ్వకుండా ఆగలేను. మేరా కిర్రాక్ ఇస్మార్ట్.. ఈ బ్లాక్ బస్టర్ ని ఎంజాయ్ చేద్దాం. త్వరగా రానీ“ అని రిప్లయ్ ఇచ్చారు. ఈ బ్లాక్ బస్టర్ ఫుల్లుగా ఎంజాయ్ చేసేద్దాం.. ఆగలేక పోతున్నా! అంటూ పూరి చాలానే జోష్ చూపించారు. ఆ ఇద్దరి సంభాషణ ఫ్యాన్స్ లోకి దూసుకెళ్లింది. ఇక రామ్ హైదరాబాద్ లో దిగగానే ఉస్తాద్ గా మారిపోవడం గ్యారెంటీ. పూరి `కేవ్`లో పార్టీకి ఏర్పాట్లు రెడీ. ఈ పార్టీలో నిధి నభా జాయిన్ అవుతారేమో!!
Please Read Disclaimer