‘అది బ్లాక్ బస్టర్ స్క్రిప్ట్.. మార్పులు చేసే ప్రసక్తే లేదు’

0

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గతేడాది ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మళ్ళీ ఫార్మ్ లోకి వచ్చాడు. ఈ జోష్ లో సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో ‘ఫైటర్’ వర్కింగ్ టైటిల్ తో సినిమా స్టార్ట్ చేసాడు పూరీ. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పూరీ – ఛార్మి – కరణ్ జోహార్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీలో కూడా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. ఈ చిత్రం అమ్మ సెంటిమెంట్ తో పాటు కిక్ బాక్సింగ్ నేపథ్యంలో ఉంటుందని సమాచారం. విజయ్ తల్లిగా రమ్యకృష్ణ కనిపించనున్నారట. కాగా ఈ సినిమాకి సంభందించిన భారీ షెడ్యూల్ ముంబై లో జెట్ స్పీడ్ లో కంప్లీట్ చేసిన పూరీ స్పీడ్ కి కరోనా వచ్చి బ్రేకులు వేసింది. దీంతో షూటింగ్ నిలుపుదల చేసుకుంది. ఐతే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల వల్ల అవుట్ డోర్ లొకేషన్లకు షూటింగుల కోసం వెళ్లే ఛాన్స్ లేదు. కాబట్టి పూరి తన స్క్రిప్ట్లో భారీ మార్పులు చేశారని.. లొకేషన్ కూడా హైదరాబాద్ కి షిఫ్ట్ అవుతున్నాయని రూమర్స్ వచ్చాయి.

ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ నటి నిర్మాత ఛార్మి కౌర్ ని దీనిపై వివరణ అడిగారు. ”మేడమ్ స్క్రిప్టు మార్పులు చేశారని వస్తున్న వార్తలపై దయచేసి స్పష్టత ఇవ్వండి. లొకేషన్ తో పాటు కొన్ని అంశాల్ని కూడా మార్చారని తెలిసింది” అంటూ బాధపడుతున్న ఎమోజీని షేర్ చేశారు. దీనికి ఛార్మి సమాధానం ఇస్తూ.. ”స్క్రిప్ట్ లో ఎటువంటి మార్పు చేయలేదు.. చేసే ప్రసక్తే లేదు. ‘ఫైటర్’ స్క్రిప్టు బ్లాక్ బస్టర్.. కరోనా క్రైసిస్ పూర్తిగా సమిసిపోయిన తర్వాత షూటింగ్ ను తిరిగి ప్రారంభిస్తాం. ఈ సినిమా విషయంలో మేమంతా సూపర్ డూపర్ నమ్మకంతో ఉన్నాం. త్వరలోనే ఒరిజినల్ టైటిల్ ను ప్రకటించబోతున్నాం” అని ట్వీట్ చేసారు. దీంతో పూరీ – విజయ్ దేవరకొండ సినిమాపై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టినట్లైంది. కాగా హీరోయిన్ ఛార్మీ సినిమాలకు దూరమైన తర్వాత పూరీ జగన్నాథ్ తో కలిసి మూవీ ప్రొడక్షన్ లోకి దిగింది. గతేడాది ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో లాభాల బాట పట్టింది. ప్రస్తుతం విజయ్ సినిమాతో పాటు పూరీ తనయుడు ఆకాష్ హీరోగా నటిస్తున్న ‘రొమాంటిక్’ మూవీ నిర్మాణంలో ఛార్మీ భాగస్వామిగా వ్యవహరిస్తోంది.
Please Read Disclaimer