ఇస్మార్ట్ దెబ్బతో ఛార్మీ క్రేజ్ పెరిగిందట!

0

ప్రపంచమంతా సక్సెస్ చుట్టూనే తిరుగుతుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఫిలిం ఇండస్ట్రీలో అది ఇంకాస్త ఎక్కువ. ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ చాలా తక్కువ కాబట్టి దాని విలువ ఎక్కువ ఉండడం సహజమే. ‘ఇస్మార్ట్ శంకర్’ కు ముందు ఆ సినిమాకు పనిచేసిన కీలక సభ్యులెవరూ సక్సెస్ లో లేరు. సినిమా ఇంత హిట్ అవుతుందని ప్రేక్షకులు కూడా ఊహించి ఉండరు.. కానీ సినిమా మాత్రం బంపర్ హిట్ అయింది.

ఈ సినిమాతో అందరూ ఒక్కసారిగా ఫామ్ లోకి వచ్చారు. అయితే అందరికంటే ఎక్కువగా ఛార్మీకి డిమాండ్ పెరిగిందట. ‘ఇస్మార్ట్ శంకర్’ ను పూరి జగన్నాధ్.. ఛార్మీ సంయుక్తంగా నిర్మించిన సంగతి తెలిసిందే. సినిమాలో ఛార్మీ షేర్ ఎంత అనేది వెల్లడి కాలేదు కానీ ఈ సక్సెస్ ఛార్మీని ఫుల్ రీఛార్జ్ చేసిందనడంలో సందేహం లేదు. గత కొంత కాలంగా ఛార్మీ పూరి సినిమాలకు ప్రొడక్షన్ బాధ్యతలు చూస్తూ ఉంది. అయితే ఆ సినిమాలు హిట్ కాకపోవడంతో ఎవరూ పట్టించుకోలేదు. పైగా రెండేళ్ళ క్రితం పూరి – నితిన్ సినిమా క్యాన్సిల్ అవడానికి కారణం ఛార్మీనే అని గుసగుసలు వినిపించాయి.

అయితే ‘ఇస్మార్ట్ శంకర్’ విషయంలో ఛార్మీ ప్రొడక్షన్ ప్లానింగ్ అద్భుతంగా ఉందని పూరి స్వయంగా మెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఛార్మీ వల్లే ‘ఇస్మార్ట్ శంకర్ అతి తక్కువ బడ్జెట్ లో పూర్తి చేయగలిగామని ఓ ప్రమోషనల్ ఈవెంట్ లో పూరి చెప్పాడు. పూరి చెప్పడమే కాదు.. ఈ సినిమాకు పని చేసిన యూనిట్ సభ్యుల ద్వారా ఛార్మీ మేనేజ్మెంట్ స్కిల్స్.. మనీ మేనేజ్మెంట్ అద్బుతంగా ఉన్నాయని.. రెమ్యూనరేషన్ల దగ్గరనుండి ప్రొడక్షన్ బాధ్యత అంతా ఒంటి చేత్తో చక్కబెట్టిందని టాక్ బయటకు రావడంతో ఇండస్ట్రీలోఛార్మీకి డిమాండ్ పెరిగిందట. కొందరు నిర్మాతలు ఇప్పటికే తమ సినిమాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పని చేయాలని కోరుతూ ఛార్మీకి ఆఫర్లు ఇస్తున్నారట. అందుకోసం భారీగా రెమ్యూనరేషన్ ఇస్తామని అంటున్నారట.

అయితే ఛార్మీ ఇలాంటి ఆఫర్లను సున్నితంగా తిరస్కరిస్తోందని.. పూరి జగన్నాధ్ తోనే తన జర్నీని కంటిన్యూ చేయాలనే ఆలోచనలో ఉందని సమాచారం. మరోవైపు పూరి కూడా తన ఫ్యూచర్ ప్రాజెక్టులు అన్నిటికి ఛార్మీ సహ నిర్మాతగా ఉండాలని భావిస్తున్నాడట. త్వరలో ఛార్మీ టాలీవుడ్ ఏక్తా కపూర్ గా మారుతుందేమో మరి.
Please Read Disclaimer