నీ పెదవులు తేనె.. నీ ముద్దులు వైన్!!

0

అగ్ర కథానాయికగా టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన ఛార్మి ఇటీవల నిర్మాతగానూ కొత్త బాధ్యతని చేపట్టిన సంగతి తెలిసిందే. `మెహబూబా` సినిమాతో నిర్మాతగా మారారు పంజాబీ కుడి ఛార్మి కౌర్. స్టార్ డైరెక్టర్ పూరితో కలిసి ఈచిత్రానికి పెట్టుబడులు పెట్టారు. అయితే తొలి ప్రయత్నం ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడం నిరాశ కలిగించింది. అయినా ప్రస్తుతం పూరి వారసుడు ఆకాష్ పూరి నటిస్తున్న రెండో సినిమా `రొమాంటిక్`కి ఛార్మి కౌర్ నిర్మాతగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పూరి కనెక్ట్స్ సీఈవోగా తనవంతు బాధ్యతల్ని ఛార్మి నెరవేరుస్తున్నారు. ప్రస్తుతం ఆన్ లొకేషన్ సీరియస్ గా వర్క్ సాగుతోంది.

లొకేషన్ నుంచి రెగ్యులర్ గా ఛార్మి ఏదో ఒక ఫోటోని షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటున్నారు. ఇటీవలే మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా ఓ స్పెషల్ వీడియోని ఛార్మి షేర్ చేశారు. ఆ వీడియోలో ఇండస్ట్రీలో మహిళలకు పురుషపుంగవులు ఏ విధమైన గౌరవిస్తారో మాకు తెలుసులే! అంటూ ఛమత్కారంతో కూడుకున్న విరుపులతో విరుచుకుపడడం అందరికీ షాకిచ్చింది.

తాజాగా గోవా నుంచి `రొమాంటిక్` ఆన్ లొకేషన్ ఫోటోల్ని ఛార్మి షేర్ చేశారు. షూటింగ్ లొకేషన్ లో నిర్మాత ఛార్మి హడావుడి కనిపిస్తోంది ఈ ఫోటోల్లో. అసలే ఎండాకాలం కావడంతో తనకు గొడుగు పట్టేందుకు ఒకరు తప్పనిసరి అని అర్థమవుతోంది. దర్శకుడు సహా ఇతర టీమ్ తో చార్మి ఎంతో కలివిడిగా కలిసిపోయి సీరియస్ మోడ్ లోనే పని చేస్తున్నారు. దాంతో పాటే ఛార్మి చేతిలో ఖరీదైన ఓ ట్యాబ్ కనిపిస్తోంది. అందులోనే విజువల్స్ ఎలా వచ్చాయో పరిశీలిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆ క్రమంలోనే ఛార్మి ఎంతో ఎగ్జయిట్ అవుతూ `రొమాంటిక్` మూవీ ఎంతో బాగా వస్తోందని తెలిపారు. ‘బేబి ప్రొడక్ట్ `రొమాంటిక్` చాలా అద్భుతంగా వస్తోంది. థ్రిల్లింగ్ గా.. ఎగ్జయిటింగ్ గా అనిపిస్తోంది. ప్రతి రోజూ గర్వంగా ఉండేలా అనీల్ పాడూరి (దర్శకుడు) పని చేస్తున్నారు. గోవాలో ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది’ అని ట్వీట్ చేశారు ఛార్మి. వేరొక ట్వీట్ లో కాస్త రొమాంటిక్ కవిత్వాన్ని పోస్ట్ చేశారు. ‘నీ పెదవులు హనీ.. నీ కౌగిలి దుప్పటి కంటే వెచ్చనిది. నీ ముద్దులు వైన్ లాంటివి. నేను తాగాలనుకుంటున్నా..!!’ అంటూ అద్భుతమైన మత్తెక్కిపోయే కవిత్వాన్ని పోస్ట్ చేశారు. దానికి వ్యంగ్యమైన ఓ ఈమోజీని జోడించడం ఇంట్రెస్టింగ్.
Please Read Disclaimer