అల్లరి పిడుగుగా మారిన ఇస్మార్ట్ ప్రొడ్యూసర్!

0

ప్రొడ్యూసర్లు చాలామందే ఉంటారు కానీ బ్యూటిఫుల్ ప్రొడ్యూసర్లు అరుదు. సీనియర్ హీరోయిన్ ఛార్మి అలాంటి అందమైన నిర్మాత. దాదాపు 60 కి పైగా సినిమాల్లో నటించిన ఛార్మి ఈమధ్య నటనకు దూరంగా ఉంటూ నిర్మాత గా మారింది. పూరి జగన్నాధ్ తో కలిసి పూరి కనెక్ట్స్ అనే బ్యానర్ ను స్థాపించి వరసగా సినిమాలు చేస్తోంది. ‘ఇస్మార్ట్ శంకర్’ తో భారీ విజయాన్ని కూడా సొంతం చేసుకుంది. రెట్టించిన ఉత్సాహంతో ప్రస్తుతం విజయ్ దేవరకొండ – పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో ఒక సినిమా నిర్మిస్తోంది.

ఛార్మి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వ్యక్తి. రెగ్యులర్ గా ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఉంటుంది. తాజాగా ఛార్మి ఒక ప్రైవేట్ పార్టీకి సంబంధించిన ఫోటోలను తన ట్విట్టర్ ఖాతా ద్వా షేర్ చేసింది. సీనియర్ దర్శకుడు జయంత్ సి. పరాన్జీ తో కలిసి చేసుకున్న ఫ్రెండ్షిప్ పార్టీ అది. ఓ 20 ఏళ్ళ క్రితం సీనియర్ స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ సినిమాలు రూపొందించిన జయంత్ తో ఛార్మి స్నేహం ఈనాటిది కాదట. జయంత్ దర్శకత్వంలో తెరకెక్కిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అల్లరి పిడుగు’ లో ఛార్మి హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా 2005 లో రిలీజ్ అయింది. ఆ సినిమా ఫ్లాప్ అయింది కానీ ఇద్దరి మధ్య స్నేహం మాత్రం ఇప్పటికీ కొనసాగుతోంది.

తమ స్నేహానికి 16 ఏళ్లు పూర్తయిన సందర్బంగా పార్టీ చేసుకుని ఆ ఫోటోలనే ఛార్మి షేర్ చేసింది. జయంత్.. ఛార్మిలతో పాటు మరి కొందరు బ్యూటిఫుల్ లేడీస్ కూడా ఆ ఫోటోలలో ఉన్నారు. ఫోటోలలో ఛార్మీ అల్లరి మామూలుగా లేదు. జయంత్ జ్యూస్ గ్లాస్ లో స్ట్రా పెట్టడం.. వెనక నిలుచుని అల్లరిగా నవ్వడం లాంటివి చేస్తూ తెగ హంగామా చేసింది. ఇది ఇస్మార్ట్ హంగామా అనుకోవచ్చు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-