అందరిని ఆమె చూసుకుంది

0

రామ్ హీరోగా నిధి అగర్వాల్ మరియు నభా నటేష్ లు హీరోయిన్స్ గా నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ విడుదలకు సిద్దం అయ్యింది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. పూరి బ్యానర్ అయినా కూడా ఈ చిత్రం నిర్మాణ బాధ్యతలు పూర్తిగా ఛార్మి చూసుకుందట. సినిమాకు కావాల్సిన ప్రతి విషయాన్ని ఆమె స్వయంగా దగ్గరుండి మరీ చూసుకుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

ఆమె ఒక నిర్మాతగా కాకుండా ప్రొడక్షన్ టీం మాదిరిగా పని చేసిందని ఇప్పటికే అందరి ప్రశంసలు అందుకుంది. తాజాగా చిత్ర ప్రీ రిలీజ్ వేడుక బోనాల కార్యక్రమంలో రామ్ మాట్లాడుతూ షూటింగ్ ను చాలా ఎంజాయ్ చేస్తూ ఫినిష్ చేశాం. చిత్ర యూనిట్ సభ్యులందరిని మెయింటెన్ చేయడం.. ప్రతి ఒక్క విషయాన్ని మేనేజ్ చేయడం ఏ రోజుకు ఆరోజు షూటింగ్ వ్యవహారాలను పర్యవేక్షించడం వంటి పనులను ఛార్మి చాలా సమర్ధవంతంగా నిర్వర్తించింది. ఆమె వల్ల మాకు చాలా వర్క్ తక్కువ అయ్యింది. నా ప్రతి సినిమా కంటే ఈ సినిమాకు కాస్త ఎక్కువగా కష్టపడ్డానంటూ రామ్ చెప్పుకొచ్చాడు.

దర్శకుడు పూరితో పాటు రామ్ కు కూడా ఈ చిత్రం సక్సెస్ చాలా అవసరం. అలాగే హీరోయిన్స్ నిధి అగర్వాల్ మరియు నభా నటేష్ లు స్టార్ డం దక్కించుకోవాలంటే ఈ చిత్రం సక్సెస్ అవ్వాల్సిందే. చాలా మంది భవిష్యత్తు ఈ చిత్రం ఫలితంపై ఆధారపడి ఉంది. మరి ఈ చిత్రం ఎలా ఉంటుందో చూడాలంటే జులై 18 వరకు వెయిట్ చేయాల్సిందే.
Please Read Disclaimer