అది మాత్రం ఎందుకు? మొత్తం చూపించొచ్చు కదా! ట్రోల్స్‌పై టీవీ నటి జబర్ధస్త్ కౌంటర్స్

0

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సెలబ్రిటీలకు ట్రోలింగ్స్ అనేవి సాధారణం అయ్యాయి. ఏ చిన్న అవకాశం దొరికినా నటీనటులను ట్రోల్ చేస్తూ ఇష్యూ వైరల్ చేసేస్తున్నారు నెటిజన్లు. ఈ క్రమంలోనే తాజాగా మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్ భార్య, టెలివిజన్ నటి చారు అసోపాకు సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పెట్టిన ఓ పోస్ట్‌పై నెగెటివ్ కామెంట్స్ చేస్తూ ట్రోల్స్ చేశారు నెటిజన్స్. ఈ కామెంట్స్‌ని సీరియస్‌గా తీసుకున్న ఆమె స్ట్రాంగ్ కౌంటర్ వేసింది.

రెడ్‌ కలర్‌ క్రాప్‌ జాకెట్‌ ధరించి ఓ పాటకు డ్యాన్స్ చేసిన వీడియోను పోస్ట్ చేసింది . దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది చూసిన నెటిజన్స్ మిశ్రమంగా స్పందిస్తూ కామెంట్స్ చేశారు. `నీ డ్రెస్సింగ్ సరిగ్గా లేదు.. అలాంటి దుస్తులు ధరించడానికి సిగ్గుగా లేదా` అంటూ విమర్శించారు. ఓ నెటిజన్ మాత్రం ఏకంగా `ఆ జాకెట్ మాత్రం ఎందుకు` అంటూ కామెంట్ చేసింది. అంతేకాదు ”అందాలు చూపించాలంటే.. చూపించి.. చూపించినట్టు ఎందుకు.. మొత్తం చూపించవచ్చు కదా” అని పేర్కొంది.

 

View this post on Instagram

 

Pehli baarish ki Khushi❤️ ❤️❤️ @fomo_thelabel #fomo

A post shared by Charu Asopa Sen (@asopacharu) on


ఈ కామెంట్ చూసి ఘాటుగా స్పందించిన చారు.. తనకు ఒంపు సొంపులతో మంచి శరీరం ఉంది. అందుకే నేను చూపించాలనుకొన్నానని, ఒకవేళ నీకు అలాంటి ఒంపు సొంపులు ఉంటే నీవు చూపించుకో. చూసే కళ్లను బట్టే ఎదుటివారిపై అభిప్రాయం మారుతుందంటూ స్ట్రాంగ్ కౌంటర్ వేసింది. ఆమె ఇచ్చిన స్ట్రాంగ్ రియాక్షన్ చూసి కొందరు నెటిజన్స్ చారును సపోర్ట్ చేస్తున్నారు.

 

అనవసరంగా ట్రోల్ చేసే వారిని ఇలాంటి కౌంటర్లు పడాల్సిందే అంటున్నారు. మహాదేవ్‌, దియా ఔర్‌ బాతి హమ్‌, మేరే ఆంగ్నే మెయిన్‌, మహారక్షక్‌ వంటి టీవీ షోలలో నటించి మంచి పేరును సంపాదించిన చారు అసోపా.. కాల్‌ ఫర్‌ ఫన్‌, ఇంపేషెంట్‌ వివేక్‌ వంటి సినిమాల్లోనూ నటించింది.
Please Read Disclaimer