స్టార్ హీరోయిన్ పై చీటింగ్ కేసు నమోదు

0

ఇటీవలే రెండవ సారి తల్లిదండ్రులు అయిన శిల్ప శెట్టి.. రాజ్ కుంద్రాలపై చీటింగ్ కేసు నమోదు అయ్యింది. తమ ఇంట్లోకి మహాలక్ష్మి వచ్చిందని ఆనందంగా ఈ జంట ప్రకటించిన కొన్ని రోజులకే సచిన్ జోషి అనే వ్యక్తి వీరిపై చీటింగ్ కేసు పెట్టడంతో మరోసారి వార్తల్లో నిలిచారు. చీటింగ్ కేసును నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం విచారణ మొదలు పెట్టారు. గోల్డ్ స్కీమ్ పేరు తో నన్ను వీరిద్దరు మోసం చేశారు అంటూ సచిన్ జోష్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

కేసు పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 2014వ సంవత్సరం లో రాజ్ కుంద్రా మరియు శిల్ప శెట్టి డైరెక్టర్స్ గా ఉన్న సత్యయుగ్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో తాను 18.58 లక్షల పెట్టుబడి పెట్టాను అన్నాడు. అందుకు గాను తనకు గోల్డ్ ఇవ్వాల్సి ఉందని కాని డేట్ దాటిన తర్వాత కూడా నాకు గోల్డ్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు అంటూ సచిన్ ఫిర్యాదు లో పేర్కొన్నాడు.

2019 మార్చికి తన టర్మ్ ప్లాన్ ముగిసినా కూడా ఇప్పటి వరకు గోల్డ్ ఇవ్వలేదని అతడు వాపోతున్నాడు. ఈ విషయమై వారిని సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆ కంపెనీకి చాలా కాలం క్రితమే తాము రాజీనామా చేశామని అంటున్నారు. ప్రస్తుతం ఆ కంపెనీనే లేదు. ఇప్పుడు తాను ఎవరిని అడగాలో కూడా తెలియదు అంటూ పోలీసులకు విన్నవించాడు. పోలీసులు త్వరలో శిల్ప శెట్టి మరియు రాజ్ కుంద్రాలను ప్రశ్నించే అవకాశం ఉంది. ఆర్థిక నేరంకు పాల్పడ్డందుకు ఈ జంటకు కఠిన శిక్ష విధించాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-