కొత్త ఫ్రెండుతో చెర్రీ ఆటవిడుపు

0

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో స్వాతంత్య్రం కోసం పోరాడిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఆ పాత్ర యంగ్ గా ఉన్నప్పుడు ఎలా ఉండేదో చరణ్ రూపంలో తెరపై చూసుకునే వీలు కల్పించారు జక్కన్న- విజయేంద్ర ప్రసాద్ బృందం.

అల్లూరి పాత్ర కోసం చరణ్ పూర్తిగా బాడీ లాంగ్వేజ్ ని మార్చేశారు. దానికోసం జిమ్ముల్లో కసరత్తులతో చక్కని రూపం తెచ్చారు. సూటబుల్ మీసకట్టుని రెడీ చేశారు. చెర్రీ-ఆలియా జంటపైనా కీలక సన్నివేశాల చిత్రీకరణ ఇంకా పెండింగు ఉందని తెలుస్తోంది. ఇకపోతే తన రూపాన్ని సినిమా ఆద్యంతం ఒకేలా ఉంచాలంటే జిమ్ లో తీవ్రంగా కసరత్తులు చేయాల్సి ఉంటుంది.

అయితే అలా జిమ్ చేస్తుండగానే తనకో కొత్త ఫ్రెండు పరిచయం అయ్యాడు. ఆ ఫ్రెండు ఎవరు? అంటే ఇదిగో ఈ చిన్నారి బాలకుడు. తనతో ఆటవిడుపుగా చరణ్ ఏం చేస్తున్నాడో చూడండి. ధ్రువ హీరో రామ్ చరణ్ మీరే కదా? అని ఆ బాలుడు అంటుంటే అబ్బే అది నేను కాదు! అంటూ ఆట పట్టించేస్తున్నాడు చెర్రీ. ఆ కుర్రాడు కాదు నువ్వే ధ్రువ అంటుంటే చరణ్ నేను కానే కాదు అంటూ టీజ్ చేస్తున్నాడు. ఇంట్రెస్టింగ్ వీడియో ఇది. మొత్తానికి జిమ్ వల్ల ప్రయోజనం ఏమిటో ఆరోగ్యం అవసరం ఏమిటో కూడా ఆ ఇద్దరి వల్లా జనాలకు తెలిసొస్తోంది.
Please Read Disclaimer