సుశాంత్ ఆత్మహత్య… 5 ఏళ్ల క్రితం ట్వీట్ వైరల్

0

సుశాంత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ లో ఉన్న లొసుగులు మరియు లోపాలు అన్ని కూడా బయటకు వస్తున్నాయి. ఇన్ని రోజులు మౌనంగా ఉన్న వారు అంతా ఇప్పుడు నోరు విప్పుతున్నారు. బాలీవుడ్ లో ఉన్న నెపొటిజం ఏ స్థాయిలో ఉందో సాక్ష్యాధారాలతో సహా బయటకు వస్తున్నాయి. సుశాంత్ ఈ కొద్ది కాలంలోనే పదుల సంఖ్యలో సినిమాలను చేజార్చుకున్నాడు. చేతిలోకి వచ్చిన సినిమాలు కమిట్ అయిన తర్వాత ఆయన్ను తొలగించిన సందర్బాలు చాలా ఉన్నాయి.

2015 సంవత్సరంలో ప్రముఖ రచయిత చేతన్ భగత్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. హాఫ్ గర్ల్ ఫ్రెండ్ సినిమాలో సుశాంత్ నటించబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మోహిత్ సూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు అంటూ చేతన్ భగత్ ట్వీట్ చేశాడు. అయితే హాఫ్ గర్ల్ ఫ్రెండ్ సినిమాలో నటించింది సుశాంత్ కాదు. ఆ సినిమాను చివరకు చేసింది అర్జున్ కపూర్.

దర్శకుడు మరియు నిర్మాతలను మేనేజ్ చేసి ఆ సినిమా నుండి సుశాంత్ తప్పించి బోణీకపూర్ వారసుడు అయిన అర్జున్ కపూర్ ను నటింపజేశారు. నెపొటిజంకు ఇంతకు మించిన సాక్ష్యం ఏముంటుంది అంటూ అర్జున్ కపూర్ తో పాటు దర్శకుడు మోహిత్ పై ప్రస్తుతం సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే స్టార్ కిడ్స్ ను తీవ్రంగా విమర్శిస్తున్న నెటిజన్స్ ఈ దెబ్బతో మరింతగా రెచ్చి పోయి మరీ విమర్శలు గుప్పిస్తున్నారు.
Please Read Disclaimer