‘చప్పాక్ హీరో’ లక్ష్మీ అగర్వాల్ చమ్ చమ్ డాన్స్

0

2005వ సంవత్సరంలో ఒక దుర్మార్ఘుడి క్షణికావేశానికి బలైన మహిళ లక్ష్మీ అగర్వాల్. తనను పెళ్లి చేసుకోవాలంటూ బలవంతం చేసిన వ్యక్తికి నో చెప్పడంతో ఆమె జీవితమే మారిపోయింది. తనను పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకోని లక్ష్మీ అగర్వాల్ మొహంపై యాసిడ్ దాడి చేశాడు. ఆ దాడిలో ఆమె మొహం పూర్తిగా కాలిపోయింది. ఎన్నో ఆపరేషన్స్ చేసి ఆమెను ప్రాణాలతో కాపాడగలిగారు. ఆమె యాసిడ్ దారికి గురైనా కూడా అదైర్య పడకుండా మరెవ్వరికి కూడా తనలాంటి కష్టం రాకుండా ఉండాలని ఒక ఉద్యమాన్ని ప్రారంభించింది.

లక్ష్మీ అగర్వాల్ జీవితం నలుగురికి ఆదర్శం కావాలనే ఉద్దేశ్యంతో ఆమె బయోపిక్ ‘చప్పాక్’ ను తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకునే ఆ చిత్రంలో నటిస్తుంది. ఆ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సమయంలోనే లక్ష్మీ అగర్వాల్ తాజాగా బాలీవుడ్ మూవీ భాగీలోని సూపర్ హిట్ సాంగ్ చమ్ చమ్ సాంగ్ కు అదిరి పోయే స్టెప్పులు వేసింది. టిక్ టాక్ లో ఆమె డాన్స్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

సోషల్ మీడియాలో లక్ష్మీ రాయ్ డాన్స్ వీడియో తెగ షేరింగ్స్ ను దక్కించుకుంటుంది. యాసిడ్ దాడికి గురైనా కూడా ఏమాత్రం గుండె నిబ్బరం కోల్పోకుండా ఎవరో చేసిన పనికి తానెందుకు బాధపడాలనే ఉద్దేశ్యంతో జీవితంను హ్యాపీగా గడుపుతూ నలుగురికి లక్ష్మీ అగర్వాల్ ఆదర్శంగా నిలుస్తోంది. మొహంపై చిన్న మచ్చ ఉంటేనే బయటకు వెళ్లేందుకు భయపడే వారు అందంగా లేమని ఇంట్లోనే ఉండే వారికి లక్ష్మీ అగర్వాల్ ఆదర్శం అవ్వాలి.
Please Read Disclaimer