చిరు 152.. పొలిటికల్ థ్రిల్లర్ కథతోనా?

0

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించే 152వ సినిమాకి సంబంధించిన ఒక్కో అప్ డేట్ వేడెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే సైరా నరసింహారెడ్డి చిత్రంతో అభిమానుల మనసులు దోచిన చిరు మరో ప్రామిస్సింగ్ సినిమాలో నటించేందుకు సన్నాహకాల్లో ఉన్నారు. అయితే.. ఖైదీ లో కుదిరినట్టు తర్వాత.. మెగాస్టార్ లోని డ్యాన్సింగ్ స్టార్ ని ఎలివేట్ చేసే ఆస్కారం లేనందున మునుముందు సినిమాల్లో దాని పైనా పూర్తి స్థాయిలో దృష్టి సారించనున్నారట.

తొలి షెడ్యూల్ డిసెంబర్ తొలి వారం నుంచి ప్రారంభం కానుంది. అది కూడా షూట్ ని ఓ సాంగ్ షూట్ తో ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఇక థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ ఫేం సంగీతద్వయం అజయ్ – అతుల్ సంగీతం అందిస్తారని.. త్రిషను కథానాయికగా ఎంపిక చేశారని ప్రచారమవుతోంది. అయితే వీటన్నిటికీ సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. చిరు 152ని నిరంజన్ రెడ్డితో కలిసి రామ్ చరణ్ స్వయంగా నిర్మించనున్నారు.

కొరటాల మరోసారి సామాజిక నేపథ్యం ఉన్న కథాంశాన్ని ఎంచుకున్నారు. ఇందులో పొలిటికల్ డ్రామా రక్తి కట్టిస్తుందట. ఒక రకంగా శంకర్ – మురుగదాస్ తరహాలో ఎగ్జయిటింగ్ థీమ్ కి స్పెల్ బౌండ్ చేసే సీన్స్ ని రెడీ చేసుకున్న స్క్రిప్టు తో పక్కా కాన్ఫిడెంట్ గా బరిలో దిగుతున్నారని తెలుస్తోంది. మునుముందు ఇది మెగాస్టార్ పొలిటికల్ కెరీర్ కి మైలేజ్ ని పెంచేదిగా ఉంటుందట.
Please Read Disclaimer